రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా కన్వర్‌పురా గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, పార్టీ వాలంటీర్లపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పార్టీ కార్యకర్త చేయి విరిగినట్లు నాయకులు తెలిపారు.
పశువుల పాకలో పాఠాలు

రాంపురా కన్వర్‌పురాలోని పాఠశాల ప్రధాన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, దానిని కూలిపోకుండా ఇనుప యాంగిళ్లతో నిలబెట్టారు. భవనం ప్రమాదకరంగా మారడంతో మూసివేసి, సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న రేకుల షెడ్‌లోకి విద్యార్థులను తరలించారు. ఆ షెడ్‌లో పశువుల మేత పడి ఉండటంతో పాటు, నిర్మాణం నుండి ఇటుకలు రాలిపడుతుండటంతో పిల్లలు భయం గుప్పెట్లో చదువుకుంటున్నారు. ఈ దారుణ పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అశుతోష్ రాంకా, పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు అక్కడికి బయలుదేరారు.
రహదారి దిగ్బంధం.. రాజకీయ రగడ
సీజేపీ బృందం పాఠశాలకు వస్తున్నట్లు తెలుసుకున్న ఒక సమూహం రాంపురా గ్రామం వద్ద రహదారిని దిగ్బంధించింది. అశుతోష్ రాంకా బృందం అక్కడికి చేరుకోగానే వారి వాహనాలను అడ్డుకుని భౌతిక దాడికి దిగారు. "జై శ్రీరామ్" నినాదాలు చేస్తూ కొందరు వ్యక్తులు గొడవకు దిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.
ఈ దాడి వెనుక అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఉన్నారని రాంకా ఆరోపించారు. "పశువుల పాకలో పిల్లలకు పాఠాలు చెప్తున్న దారుణాన్ని బయటపెడతామనే భయంతోనే బీజేపీ గుండాలను పంపి మాపై దాడులు చేయిస్తోంది" అని ఆయన మండిపడ్డారు. సీజేపీ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లు రువ్వారని నాయకులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణలను స్థానిక గ్రామస్థులు తోసిపుచ్చారు. పాఠశాల నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 12.5 లక్షలు మంజూరయ్యాయని, విషయాన్ని రాజకీయం చేయడం ఇష్టం లేకే బయటి వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకున్నామని ఒక గ్రామస్థుడు తెలిపారు.
వివాదానికి నేపథ్యం.. విద్యాశాఖ ఆంక్షలు
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాలల తనిఖీలపై వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఆగస్టు 15న అల్వార్ జిల్లా తానాగాజిలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సీజేపీ బృందం సందర్శించి నిరసన తెలిపింది. అప్పట్లో భవన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు రాతపూర్వక హామీ ఇచ్చారు.
{{/usCountry}}రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాలల తనిఖీలపై వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఆగస్టు 15న అల్వార్ జిల్లా తానాగాజిలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సీజేపీ బృందం సందర్శించి నిరసన తెలిపింది. అప్పట్లో భవన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు రాతపూర్వక హామీ ఇచ్చారు.
{{/usCountry}}ఆ ఘటన తర్వాత రాజస్థాన్ పాఠశాల విద్యాశాఖ ప్రాంగణాల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ పూర్వానుమతి లేకుండా బయటివారు పాఠశాలల్లోకి రాకూడదని, విద్యార్థులను ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని నిబంధనలు తెచ్చింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, విద్యార్థుల భద్రత, ప్రైవసీ కోసమే ఈ నిబంధనలు తెచ్చామని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ, పాఠశాలల దుస్థితిపై తమ 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.