భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారుల కోసం అత్యంత ఉపయోగకరమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది తమ 'కమ్యూనిటీ డే'లో ప్రదర్శించిన 'పాట్‌హోల్+ అలర్ట్స్' (Pothole+ Alerts) ఫీచర్‌ను అధికారికంగా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది.

ఏథర్ జెన్-2 (Gen 2) అలాగే ఆ తర్వాత వచ్చిన 450X, 450 ఎపెక్స్ (450 Apex), రిజ్తా Z (Rizta Z) ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
9 ఏళ్ల పరిశోధన.. 'ఫ్రీట్ ఇంటెలిజెన్స్' ఆధారంగా..
ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టిందని ఏథర్ తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, గుంతలను గుర్తించేందుకు ఏథర్ తన కనెక్టెడ్ స్కూటర్ల నెట్‌వర్క్ ద్వారా బిలియన్ల కొద్దీ కిలోమీటర్ల రైడింగ్ డేటాను విశ్లేషించింది. ప్రతి ఏథర్ స్కూటర్‌లో ఉండే ఆన్‌బోర్డ్ కంప్యూటింగ్, కనెక్టివిటీ వ్యవస్థ ద్వారా రోడ్డు పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఈ 'ఫ్రీట్ ఇంటెలిజెన్స్' వ్యవస్థను రూపొందించారు.
రియల్ టైమ్ హెచ్చరికలు ఎలా పనిచేస్తాయి?
రైడర్లు తమ స్కూటర్ డాష్‌బోర్డ్‌లో నావిగేషన్ ఉపయోగిస్తున్నప్పుడు, ముందుకు వెళ్లే మార్గంలో ఉన్న గుంతలు (Potholes), దెబ్బతిన్న రోడ్లు, అశాస్త్రీయంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్ల గురించి సిస్టమ్ ముందుగానే హెచ్చరిస్తుంది.
డాష్‌బోర్డ్ డిస్‌ప్లే: స్కూటర్ డిజిటల్ స్క్రీన్‌పై హెచ్చరికలు కనిపిస్తాయి.
ఆడియో అలర్ట్స్: 'ఏథర్ హాలో' (Ather Halo) స్మార్ట్ హెల్మెట్ లేదా బ్లూటూత్ హెడ్‌సెట్ ఉపయోగిస్తున్న రైడర్లకు నేరుగా చెవిలోనే ఆడియో రూపంలో ముందస్తు హెచ్చరికలు వినిపిస్తాయి. దీనివల్ల దృష్టి రోడ్డుపై నుంచి పక్కకు మల్లకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
భవిష్యత్తు ప్రణాళికలు: 'స్మూతెస్ట్ రూట్' ఎంపిక
ప్రస్తుతం కేవలం గుంతల గురించి హెచ్చరించడమే కాకుండా, భవిష్యత్తులో నావిగేషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చాలని ఏథర్ భావిస్తోంది. త్వరలోనే వేగవంతమైన మార్గం (Fastest Route)తో పాటు దెబ్బతిన్న రోడ్లు లేని సులభమైన మార్గం (Smoothest Route) ని ఎంచుకునేలా నావిగేషన్ ఆప్షన్‌ను అందించేందుకు ఏథర్ కసరత్తు చేస్తోంది.
{{/usCountry}}ప్రస్తుతం కేవలం గుంతల గురించి హెచ్చరించడమే కాకుండా, భవిష్యత్తులో నావిగేషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చాలని ఏథర్ భావిస్తోంది. త్వరలోనే వేగవంతమైన మార్గం (Fastest Route)తో పాటు దెబ్బతిన్న రోడ్లు లేని సులభమైన మార్గం (Smoothest Route) ని ఎంచుకునేలా నావిగేషన్ ఆప్షన్‌ను అందించేందుకు ఏథర్ కసరత్తు చేస్తోంది.
{{/usCountry}}కనెక్టెడ్ వెహికల్ ఈకోసిస్టమ్‌లో పాట్‌హోల్ అలర్ట్స్ అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో డేటా ఆధారిత మరిన్ని ఫీచర్లను తీసుకొస్తామని ఏథర్ స్పష్టం చేసింది.