...
...
Next Story

Ather Konarc : ఏథర్​ బడ్జెట్​ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోనార్క్’​ లాంచ్ రేపే

ఆగస్టు 29న విడుదల కానున్న ఏథర్ ఎనర్జీ కొత్త 'కోనార్క్' ఎలక్ట్రిక్ స్కూటర్ కఠినమైన ప్రాసెస్ ద్వారా సిద్ధమైంది. భారతీయ రోడ్లు, వర్షాలు, గతుకులను తట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ మెటల్ బాడీ స్కూటర్ వివరాలు తెలుసుకోండి..

Updated on: Aug 28, 2026, 17:05:12 IST
Advertisement

ఏదైనా స్కూటర్ కొనే ముందు ప్రతీ భారతీయుడి మనసులో మెదిలే మొదటి ప్రశ్న— 'మన ప్రాంతం గతుకుల రోడ్లను, వర్షాకాలం నీళ్లను ఇది ఎంతకాలం తట్టుకోగలదు?' వినియోగదారుల ఈ ప్రధాన సందేహానికి సమాధానమిస్తూ ఏథర్ ఎనర్జీ తమ రాబోయే కొత్త స్కూటర్ ‘కోనార్క్’ పటిష్టతను నిరూపించే టెస్టింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

ఏథర్ కోణార్క్ ఈ-స్కూటర్..
ఏథర్ కోణార్క్ ఈ-స్కూటర్..

బెంగళూరులో ఆగస్టు 29న జరగనున్న 'ఏథర్ కమ్యూనిటీ డే 2026' వేదికగా ఈ స్కూటర్ అధికారికంగా కస్టమర్ల ముందుకు రానుంది.

నిత్యం పెరిగే మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కంపెనీ రూపొందించిన మాడ్యులర్ ‘ఈఎల్’ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న మొదటి ప్రోడక్ట్ ఇదే కావడం విశేషం. నిత్యం రద్దీగా ఉండే నగర రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గుంతల రోడ్లపై కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ని సిద్ధం చేశారు.

ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- 2,000 రకాల కఠిన పరీక్షలు!

ఏథర్‌కు చెందిన స్వదేశీ పరిశోధనా కేంద్రం 'ది జుగ్గర్‌నాట్' వేదికగా ఏథర్ కోనార్క్‌ను అత్యంత కఠినమైన వాతావరణంలో పరీక్షించారు. ఒక వాహనం తన జీవితకాలంలో దాదాపు 1 లక్ష కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, అవన్నీ సిమ్యులేషన్ సాంకేతికత ద్వారా 2,000 విభిన్న మూల్యాంకనాల రూపంలో నిర్వహించారు.

కేవలం రోడ్డుపై నడపడమే కాకుండా.. ఎత్తు నుంచి కింద పడేయడం, భారీ బరువులు మోపడం, డిజైన్ పటిష్టతను చూసే వైబ్రేషన్ పరీక్షలను సక్సెస్‌ఫుల్‌గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​పై ఏథర్ పూర్తి చేసింది.

ఏథర్​ కోనార్క్ టెస్టింగ్​కి సంబంధించిన వీడియోని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- గతుకుల రోడ్లు, గుంతలకు చెక్!

మన దేశంలో స్కూటర్ రైడర్లను తీవ్రంగా వేధించే గుంతలు! విరిగిన రోడ్లను తట్టుకునేలా స్కూటర్ అండర్‌బాడీ డిజైన్‌ను బలోపేతం చేశారు. వాహనంలోని హ్యాండిల్‌బార్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్, సెంటర్ స్టాండ్, స్విచ్‌లు వంటి నిత్యం వాడే భాగాల మన్నికను టెస్టింగ్ బెంచ్‌లపై సుదీర్ఘ కాలం పాటు తనిఖీ చేశారు. వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు థర్మల్ ఛాంబర్ పరీక్షలు కూడా నిర్వహించారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఏథర్ బలమైన స్టీల్ ఛాసిస్‌తో పాటు మెటల్ బాడీ ప్యానెళ్లను ఎంచుకుంది. సాధారణ ప్లాస్టిక్ బాడీ కంటే మెటల్ బాడీ వల్ల వాహనానికి రక్షణ పెరగడమే కాకుండా ప్రమాదవశాత్తు కిందపడినా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. 14 ఇంచుల ముందు వీల్, 12 ఇంచుల వెనుక వీల్, స్వింగ్‌ఆర్మ్‌పై అమర్చిన మోటార్ ఉన్నట్లు టీజర్ ద్వారా ధ్రువీకరించారు.

ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- ధర (అంచనా)

కంపెనీ ఇంకా ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, మోటార్ పవర్ లేదా అధికారిక ధరలను వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం, రూ. 1 లక్ష నుంచి రూ. 1.25 లక్షల మధ్యలో లభించే అవకాశం ఉంది. ఈ ధర వద్ద అందుబాటులోకి వస్తే బడ్జెట్ ఈవీ విభాగంలో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ప్రముఖ మోడళ్లకు ఏథర్ కోనార్క్ గట్టి పోటీ ఇవ్వనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe