...
...
Next Story

Electric Bike : మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫస్ట్​ లుక్​తోనే ఫిదా అయిపోతారు!

భారతీయ ఈవీ స్టార్టప్ 'అవోర్ ఎలక్ట్రిక్' తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, అదిరిపోయే స్పోర్టీ లుక్ మరియు ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ వివరాలు మీకోసం.

Published on: Jun 21, 2026, 08:14:13 IST
Advertisement

భారతదేశ ఈవీ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ దూసుకురాబోతోంది. ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘అవోర్ ఎలక్ట్రిక్’ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ బైక్​కి సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ తాజాగా బయటకు వచ్చింది. ఈ సరికొత్త బైక్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఈ టీజర్ ద్వారా కంపెనీ ఫస్ట్ లుక్‌ను పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు, వినూత్నమైన డిజైన్‌ను మిళితం చేస్తూ ఈ బైక్‌ను తయారు చేసినట్లు కంపెనీ తన దార్శనికతను చాటిచెప్పింది.

అదిరిపోయే లుక్.. స్పోర్టీ డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్ బైక్

అవోర్ ఎలక్టిక్ నుంచి మిడ్​ సైజ్ ఈ-బైక్..
అవోర్ ఎలక్టిక్ నుంచి మిడ్​ సైజ్ ఈ-బైక్..

అవోర్ ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ వీడియోలో ఈ- బైక్ డిజైన్, ఆకర్షణీయమైన రూపాన్ని విభిన్న కోణాల నుంచి చూపించారు. కంటిని ఆకట్టుకునేలా యాంగ్యులర్ స్కల్ప్​టెడ్ బాడీ ప్యానెల్, సరికొత్త డిజైన్‌తో కూడిన సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్, ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఫైన్ ఫినిషింగ్‌తో రూపొందించిన విడిభాగాలు ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు ఒక ప్రత్యేకమైన రూపాన్ని తెచ్చిపెట్టాయి. ఆధునిక కాలపు ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటూనే, బైక్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను ప్రతిబింబించేలా దీని స్పోర్టీ స్టైలింగ్‌ను డిజైన్ చేశారు.

భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న మిడ్-సైజ్ (మధ్యతరహా) మోటార్‌సైకిల్ విభాగంలో గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో అవోర్ ఎలక్ట్రిక్ ఈ బైక్‌ను తీసుకువస్తోంది. ఈ టీజర్ ద్వారా బైక్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా సంస్థ రివీల్ చేసింది. ఇందులో రైడర్‌కు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని స్పష్టంగా చూపించే సరికొత్త కలర్ టీఎఫ్‌టీ డిజిటల్ స్క్రీన్‌ను అమర్చారు. కేవలం అందం కోసమే కాకుండా, రైడర్ అవసరాలను తీర్చే పక్కా ఇంజనీరింగ్ ప్లాన్‌తో ఈ బైక్‌ను డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

కోర్ ఆర్కిటెక్చర్‌తోనే టెక్నాలజీ అనుసంధానం!

అవోర్ ఎలక్ట్రిక్ సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన నేటివ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆధారపడి పనిచేస్తుంది. కంపెనీకి చెందిన నిపుణులు గత కొన్నేళ్లుగా చేసిన పరిశోధనలు, అభివృద్ధి, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బైక్ ఒక నిదర్శనం. ఈ టీజర్ ద్వారా మొదటిసారిగా బైక్ పూర్తి రూపాన్ని ప్రపంచానికి చూపించారు. బైక్ నిలబడిన తీరును గమనిస్తే.. ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, అద్భుతమైన రైడింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఇన్నోవేషన్, టెక్నాలజీ కలయికతో తయారైనట్లు తెలుస్తోంది.

ఈ సరికొత్త ప్రొడక్ట్‌ను అవోర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ ముఖ్య సిద్ధాంతమైన ‘ఇంటెలిజెన్స్ బియాండ్ మోషన్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేశారు. ఈ రాబోయే ఎలక్ట్రిక్ బైక్​ని ప్రారంభ దశ నుంచి ఇంటెలిజెంట్ సిస్టమ్స్, కచ్చితత్వంతో కూడిన మాన్యుఫ్యాక్చరింగ్, రైడర్ కంఫర్ట్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేశారు. సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉండే ఈ సరికొత్త వాహనం.. అటు బైక్ పర్ఫార్మెన్స్‌ను పెంచడంతో పాటు వినియోగదారులకు ఒక సరికొత్త, అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ గట్టిగా విశ్వసిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks