రూ. 1లక్ష కన్నా తక్కువ ధరకే బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్- హైలైట్స్ ఇవి..
బజాజ్ ఆటో తన పాపులర్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన 'చేతక్ సీ25' మోడల్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. రూ. 91,399 ధరతో వస్తున్న ఈ స్కూటర్, మధ్యతరగతి వాహనదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్‌కి సంబంధించిన టాప్-5 హైలైట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా సామాన్యుడి బడ్జెట్‌కు తగినట్లుగా, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన 'చేతక్' సిరీస్‌లో కొత్త ఎంట్రీ-లెవల్ ఈ-స్కూటర్ 'బజాజ్ చేతక్ సీ25'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రాక్టికాలిటీకి, బడ్జెట్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ స్కూటర్‌ను రూపొందించారు.

మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త బజాజ్ చేతక్ సీ25లోని ఐదు ముఖ్యమైన విశేషాలు మీకోసం:
బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్..
- అత్యంత సరసమైన ధర- బజాజ్ చేతక్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన మోడల్. దీని ధరను రూ. 91,399 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి, ముఖ్యంగా మొదటిసారి ఈవీ కొనేవారికి ఇది సరైన ఛాయిస్.
2. స్టైలిష్ అండ్ కాంపాక్ట్ డిజైన్- చేతక్ అనగానే మనకు గుర్తొచ్చే సిగ్నేచర్ మెటల్ బాడీ, క్లాసిక్ లుక్ ఇందులోనూ కొనసాగింది. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా దీన్ని మరింత కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా మార్చారు. సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్, స్లీకర్ టెయిల్ లైట్ వంటి ఫీచర్లు దీనికి రిచ్ లుక్‌ను ఇస్తాయి. యువతను ఆకట్టుకునేలా ఆరు రంగుల్లో, సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో ఈ స్కూటర్ లభిస్తుంది.
3. నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపోయే పర్ఫార్మెన్స్- బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 113 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. ఆఫీసు పనులకు, కాలేజీలకు వెళ్లేవారికి, రోజువారీ సిటీ ప్రయాణాలకు ఈ వేగం, రేంజ్ సరిపోతాయి. ఈ స్కూటర్ మోటార్ గరిష్టంగా 2.95 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
4. సులభమైన హ్యాండ్లింగ్- ఎలక్ట్రిక్ స్కూటర్లలో బరువు అనేది కీలకమైన అంశం. చేతక్ సీ25 కేవలం 107-108 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీనివల్ల రద్దీగా ఉండే సిటీ రోడ్లపై నడపడం, ఇరుకైన సందుల్లో మలుపులు తిప్పడం చాలా సులభం. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు కూడా దీన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.
5. అదుర్స్ అనిపించే ఫీచర్లు- తక్కువ ధరే కదా అని ఫీచర్లలో బజాజ్ వెనకబడలేదు. ఇందులో కలర్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి. సీటు కింద 25 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇందులో సామాన్లు లేదా హెల్మెట్ పెట్టుకోవచ్చు. వర్షంలో కూడా బ్యాటరీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐపీ67 రేటింగ్ రక్షణ కల్పించారు. భద్రత కోసం డిస్క్ బ్రేక్, కొండ ప్రాంతాల్లో లేదా వాలుపై బండి వెనక్కి జారకుండా ఉండేందుకు 'హిల్ హోల్డ్ అసిస్ట్' వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.
మొత్తానికి, బ్రాండ్ వాల్యూతో పాటు విశ్వసనీయత కోరుకునే సామాన్యుడికి ఈ కొత్త బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


