ఇన్వెస్టర్స్​ అలర్ట్​- 9శాతం పడిన బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ స్టాక్​.. కారణం ఇదే!

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దాదాపు 9శాతం పతనంతో బజాజ్​ ఫైనాన్స్ స్టాక్​​ ఇన్వెస్టర్స్​లో ఆందోళనను కలిగించింది. అయితే, ఈ పతన వెనుక ఒక కారణం ఉంది.

Published on: Dec 2, 2025, 11:27:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ధర మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీ పతనాన్ని చూస్తున్నాయి! ట్రేడింగ్​ మొదలవ్వగానే బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ స్టాక్​ 9శాతం మేర నష్టపోయింది. అనంతరం కాస్త రికవర్​ అయ్యి, ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయానికి 6.3శాతం నష్టాలతో రూ. 97.8 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఈ స్టాక్​లో తాజా ఫాల్​కి ప్రధాన కారణం బ్లాక్ డీల్! ఈ డీల్​ ద్వారా 19.5 కోట్ల షేర్లు (కంపెనీ ఈక్విటీలో 2.35% వాటా- రూ. 1,890 కోట్ల వాల్యూ) రూ. 97 వద్ద విక్రయించడం జరిగింది.

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్ ఎందుకు పడుతోంది? (Photo: Pexels )
బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్ ఎందుకు పడుతోంది? (Photo: Pexels )

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ కంపెనీ ప్రమోటర్​ అయిన బజాజ్​ ఫైనాన్స్​, సంస్థలో తమకున్న వాటాలో 2% వరకు విక్రయించడానికి యోచిస్తోంది. ఈ విషయాన్ని బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ సోమవారం ఎక్స్​ఛేంజ్​కి సమాచారం అందించింది.

"కనీస పబ్లిక్ వాటా నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి, కంపెనీ ప్రమోటర్ అయిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను విక్రయించాలనే తమ ఉద్దేశాన్ని మాకు తెలియజేశారు," అని కంపెనీ ఆ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఫైలింగ్ ప్రకారం.. ప్రస్తుత తేదీ నాటికి ప్రమోటర్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ టోటల్​ పెయిడ్​-అప్​ క్యాపిటల్​లో 88.70% వాటాకు సమానమైన 7,39,10,03,845 ఈక్విటీ షేర్లను కలిగి ఉంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గత సంవత్సరం ఒక్కో షేరు రూ. 70 ఇష్యూ ధరతో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. లిస్టింగ్ అయిన తర్వాత, షేరు త్వరగా దాదాపు రూ. 190కి చేరుకుంది, ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అప్పటి గరిష్ట స్థాయి నుంచి ఈ స్టాక్​ దాదాపు 50శాతం పడిపోయింది.

గత ఐదు ట్రేడింగ్​ సెషన్​లో బజాజ్​ బౌసింగ్​ ఫైనాన్స్​ షేరు ధర రూ. 7.2శాతం పడింది. నెల రోజుల్లో దాదాపు 11శాతం డౌన్​ అయ్యింది. ఏడాది కాలంలో 23శాతం పతనమైంది.

క్యూ2 ఫలితాలు 2025: లాభాలు పెరిగినా..

దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, 2026 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో పన్ను అనంతర లాభం (ప్యాట్​)లో సంవత్సరానికి 18% పెరుగుదలను నమోదు చేసింది. ఇది రూ. 642.96 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ2ఫైవై25), కంపెనీ రూ. 545.60 కోట్ల ప్యాట్​ని నమోదు చేసింది.

ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) సంవత్సరానికి 34% పెరిగి రూ. 956 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 713 కోట్లుగా ఉంది.

అయితే, నికర వడ్డీ మార్జిన్ (ఎన్​ఐఎం) మాత్రం సంవత్సరానికి 10 బేసిస్ పాయింట్లు తగ్గి క్యూ2ఎఫ్​26లో 4%కి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 4.1%గా ఉండేది.

కంపెనీ అసెట్​ క్వాలిటీ స్వల్పంగా మెరుగుపడింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 0.29%గా ఉన్న స్థూల ఎన్‌పీఏలు, క్యూ2ఎఫ్​వై26లో సంవత్సరానికి 3 బేసిస్ పాయింట్లు తగ్గి 0.26శాతనికి చేరుకున్నాయి. అదే సమయంలో, నికర ఎన్‌పీఏలు మాత్రం 0.12% వద్ద స్థిరంగా ఉన్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More