ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 190 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 1, 2025, 08:15:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 14 పాయింట్లు పడి 85,707 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 13 పాయింట్లు కోల్పోయి 26,203 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 15 పాయింట్లు పెరిగి 59,753 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,795.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,148.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

నవంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 17,500.31 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 77,083.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 26,100- 26,000 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది. 26,300 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. ఈ రేంజ్​లో సూచీ కదలొచ్చు. 26,300 బ్రేక్​ అయితే 26,600 వరకు వెళ్లొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ ఎనలిస్ట్​ వాత్సల్​ భవ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.61 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.54శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.65 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

లారస్​ ల్యాబ్స్​- బై రూ. 1031, స్టాప్​ లాస్​ రూ. 995, టార్గెట్​ రూ. 1103

మహీంద్రా అండ్​ మహీంద్రా ఫైనాన్షిల్​ సర్వీసెస్​- బై రూ. 372, స్టాప్​ లాస్​ రూ. 359, టార్గెట్​ రూ. 398

పిరమాల్​ ఫార్మా- బై రూ. 188, స్టాప్​ లాస్​ రూ. 184, టార్గెట్​ రూ. 200

ఆర్బీఎల్​ బ్యాంక్​- బై రూ. 313, స్టాప్​ లాస్​ రూ. 308, టార్గెట్​ రూ. 325

ఆస్ట్రల్​ లిమిటెడ్​- బై రూ. 1445, స్టాప్​ లాస్​ రూ. 1430, టార్గెట్​ రూ. 1500

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

అకుటాస్ కెమికల్స్: రూ .1837 వద్ద కొనండి, లక్ష్యం రూ .1985, స్టాప్ లాస్ రూ .1777;

సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .823 వద్ద కొనండి, లక్ష్యం రూ .888, స్టాప్ లాస్ రూ .795;

లాటెంట్ వ్యూ అనలిటిక్స్: రూ .498 వద్ద కొనండి, లక్ష్యం రూ .535, స్టాప్ లాస్ రూ .480;

జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్: రూ .392 వద్ద కొనండి, టార్గెట్ రూ .420, స్టాప్ లాస్ రూ .380;

డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .533 వద్ద కొనండి, లక్ష్యం రూ .575, స్టాప్ లాస్ రూ .515.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More