Bank holiday today : ఈరోజు బ్యాంకులకు సెలవు- ఈ వారంలో మరిన్ని..

దీపావళి సందర్భంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడి ఉంటాయి. కాగా ఈ వారంలో దేశవ్యాప్తంగా మరికొన్ని బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 20, 2025, 07:33:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రాష్ట్రాల వారీ సెలవుల జాబితా ప్రకారం.. దీపావళి నేపథ్యంలో ఈరోజు, అక్టోబర్ 20 (సోమవారం), దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు కూడా మూతపడి ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు..
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు..

హైదరాబాద్​, విజయవాడ, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలతో పాటు అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇటానగర్, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, దిల్లీ, పనాజీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురంలో నేడు బ్యాంకులకు సెలవు ఉంటుంది.

దీపావళి 2025 పండుగ విశేషాలు

దీపావళి: ఇది హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటి. చీకటిపై వెలుగుకు, చెడుపై మంచికి విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు. రావణాసురుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. అందుకే దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు.

దీపావళి తేదీని అమావాస్య తిథిని బట్టి నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం, అమావాస్య తిథి అక్టోబర్ 20న మొదలై అక్టోబర్ 21న ముగుస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాల్లో దీపావళిని అక్టోబర్ 20నే జరుపుకుంటున్నారు.

అక్టోబర్ 2025లో రాబోయే బ్యాంకు సెలవులు..

జాతీయ, మతపరమైన, ప్రాంతీయ పండుగలకు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో పాటు ప్రతి నెలా రెండొవ, నాల్గొవ శనివారాలు, అలాగే ప్రతి ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఇక అక్టోబర్ 2025లో రాబోయే ఇతర సెలవుల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

అక్టోబర్ 21 : దీపావళి అమావాస్య, దీపావళి, గోవర్ధన్ పూజ- బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, శ్రీనగర్ బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 22 : దీపావళి, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే, గోవర్ధన్ పూజ, బాలిపాడుగమి, లక్ష్మీ పూజ- అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్ బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 23 : భాయ్ బిజ్, భాయ్‌దూజ్, చిత్రగుప్త జయంతి, భ్రాతృద్వితీయ, నింగోల్ చాక్కుబా అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లా బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 27 : ఛత్ పూజ- కోల్‌కతా, పట్నా, రాంచీ బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 28 : ఛత్ పూజ- పట్నా, రాంచీ బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి- అహ్మదాబాద్ బ్యాంకులకు సెలవు.

బ్యాంక్ సెలవుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు.

ఆన్‌లైన్ ఫండ్ బదిలీ: కస్టమర్‌లు NEFT/RTGS వంటి ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలను ఉపయోగించవచ్చు.

కార్డు సేవలు: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

ఇతర సేవలు: ఆన్‌లైన్‌లో డిమాండ్ డ్రాఫ్ట్ అభ్యర్థన ఫారమ్‌లు, చెక్‌బుక్ అభ్యర్థన ఫారమ్‌లు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏర్పాటు, లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలను కూడా పొందవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More