...
...
Next Story

Bank holidays : 7 రోజుల్లో 6 సెలవులు! ఈ వారం బ్యాంక్​ హాలీడే లిస్ట్​..

Hyderabad Bank holidays : ఈ వారం బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 మధ్య మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడేతో పాటు ఇతర కారణాల వల్ల వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆరు రోజుల పాటు మూతపడనున్నాయి. ఆ వివరాలు..

Published on: Mar 30, 2026 10:00 AM IST
Advertisement

బ్యాంకు పనుల కోసం వెళ్లే వారికి ముఖ్య గమనిక. వచ్చే వారం (మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాల్లో బ్యాంకులు పనిచేయవు.

ఈ వారం బ్యాంక్​ హాలీడే లిస్ట్​..
ఈ వారం బ్యాంక్​ హాలీడే లిస్ట్​..

రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ వారం బ్యాంకు సెలవుల పూర్తి జాబితా..

మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు.

మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి / జన్మకళ్యాణక్ సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్​ బెంగాల్, దిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.

ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకు అకౌంట్​ యాన్యువల్​ క్లోజింగ్ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్,దిల్లీ, బీహార్ సహా దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

2026 ఏప్రిల్​ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్​ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

సాధారణంగా ఆర్బీఐ బ్యాంక్ సెలవులను మూడు విభాగాలుగా గుర్తిస్తుంది: నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్​టీడీఎస్​) సెలవులు, ఖాతాల ముగింపు సెలవులు. నిబంధనల ప్రకారం.. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే, మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

ఈ వరుస సెలవులు ఉన్నందున, నగదు ఉపసంహరణ లేదా ఇతర ముఖ్యమైన లావాదేవీల కోసం ఇబ్బంది కలగకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. బ్యాంకు సెలవు ఉన్నప్పుడు అత్యవసరంగా డబ్బు పంపాలి లేదా కావాలి అంటే ఏం చేయాలి?

సమాధానం: బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. మీరు యూపీఐ (ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం) ద్వారా లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగించి ఐఎంపీఎస్​ ద్వారా తక్షణమే డబ్బు పంపవచ్చు. నగదు కావాలంటే ఏటీఎం సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే, సెలవుల సమయంలో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ముందే కొంత నగదును సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

2. బ్యాంకు సెలవు రోజున చెక్కు డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? క్లియరెన్స్ ఎప్పుడు జరుగుతుంది?

సమాధానం: మీరు సెలవు రోజున బ్యాంక్ డ్రాప్ బాక్స్‌లో చెక్కు వేసినా, అది తదుపరి పనిదినం వరకు ప్రాసెస్ కాదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంక్ సెలవు రోజుల్లో సీటీఎస్​ (Cheque Truncation System) పనిచేయదు. కాబట్టి, ఆ చెక్కు క్లియరెన్స్ అవ్వడానికి ఒకటి లేదా రెండు పనిదినాలు పట్టవచ్చు. సెలవుల సమయంలో ఎవరికైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే, చెక్కు కంటే నెఫ్ట్​ లేదా ఆర్​టీజీఎస్​ వంటి ఆన్‌లైన్ పద్ధతులను ఎంచుకోవడం శ్రేయస్కరం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe