April Bank holidays : ఏప్రిల్​ 2026లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవుల లిస్ట్​ ఇదే..

Telangana bank holidays April 2026 : అలర్ట్​! ఏప్రిల్​ 2026కి సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్​ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారు ఈ లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి..

Published on: Mar 29, 2026, 10:41:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంకొన్ని రోజుల్లో మార్చ్​ నెల పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ 2026లో బ్యాంకు పనులను ప్లాన్​ చేస్తున్న వారికి ముఖ్యమైన అలర్ట్​! ఏప్రిల్​ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల డేటాను ఆర్బీఐ విడుదల చేసింది. తెలంగాణ, హైదరాబాద్​, ఆంధ్రప్రదేశ్​తో పాటు దేశవ్యాప్తంగా.. వచ్చే నెలలో బ్యాంకు హాలిడే లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఏప్రిల్​ 2026 బ్యాంకు సెలవుల లిస్ట్..
ఏప్రిల్​ 2026 బ్యాంకు సెలవుల లిస్ట్..

ఏప్రిల్​ 2026లో బ్యాంకు సెలవుల జాబితా..

ఏప్రిల్​ 1 : బుధవారం, అకౌంట్స్​ యాన్యువల్​ క్లోజింగ్- త్రిపుర, గుజరాత్​, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్​, ఒడిశా, చంఢీగఢ్​, తమిళనాడు, ఉత్తరాఖండ్​, అసోం, తెలంగణ, మణిపూర్​, అరుణాచల్​ప్రదేశ్​, రాజస్థాన్​, జమ్ము కశ్మీర్​, ఉత్తర్​ప్రదేశ్​, కేరళ, పశ్చిమ్ బెంగాల్​, గోవా, బిహార్​, ఛత్తీస్​గఢ్​, ఆంధ్రప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 2, 2026 : మౌండీ థర్స్​డే, కేరళలోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 3, 2026 : గుడ్​ ఫ్రైడే, శుక్రవారం- దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 14, 2026 : డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి, మంగళవారం- దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 15 : బెంగాళీ నూతన ఏడాది, బొహగ్​ బిహు, హిమాచల్​ డే బుధవారం- అగర్తలా, గువాహటీ, ఇటానగర్​, కొచ్చి, కోల్​కతా, శిమ్లా, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 16 : బొహగ్​ బిహు, గురువారం- గువాహటీలోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 20 : బసవ జయంతి, అక్షయ తృతీయ, సోమవారం- కర్ణాటకలోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 21 : గరియ పూజ, మంగళవారం- అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.

వారాంతపు సెలవుల లిస్ట్​ ఇలా..

వీటితో పాటు ఏప్రిల్​ 5 (ఆదివారం), ఏప్రిల్​ 11 (రెండో శనివారం), ఏప్రిల్​ 12 (ఆదివారం), ఏప్రిల్​ 19 (ఆదివారం), ఏప్రిల్​ 25 (నాలుగో శనివారం), ఏప్రిల్​ 26 (ఆదివారం) బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి.

ముఖ్య గమనిక :- పశ్చిమ్​ బెంగాల్​, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరీలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా తేదీలలో అక్కడి స్థానిక బ్యాంకులు మూతపడి ఉంటే అవకాశం ఉంది.

వచ్చే వారం ఏకంగా 6 రోజులు సెలవులు!

మార్చ్​ నెల చివరి రెండు రోజులు- ఏప్రిల్​ నెల మొదటి 5 రోజుల్లో అనేక రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు లభిస్తున్నాయి.

మార్చ్​ 30, 31- మహవీర్​ జయంతి సందర్భంగా సోమవారం కర్ణాటకలో., మంగళవారం గుజరాత్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, తమిళనాడు, రాజస్థాన్​, యూపీ, పశ్చిమ్​ బెంగాల్​, దిల్లీ, బిహార్​, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​లోని బ్యాంకులకు సెలవు.

ఇక పైన చెప్పినట్టు ఏప్రిల్​ 1 నుంచి 5 వరకు ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి.

అయితే, బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఏటీఎంలు, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ వంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయి. నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు వంటి పనులను ఆన్‌లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు.

బ్యాంకులకు వెళ్లే వారు మాత్రం ఆయా సెలవు రోజులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతెేకాదు, మీ స్థానిక బ్రాంచ్ పనివేళలను లేదా సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More