Central Bank of India Recruitment : అలర్ట్! నెలకు రూ. 1.2లక్షల వరకు జీతంతో బ్యాంకు ఉద్యోగాలు..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. మొత్తం 275 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ రిక్రూట్మెంట్లో ఎంపికైన వారికి గరిష్ఠంగా రూ. 1.2 లక్షల వరకు జీతాలు ఉంటాయి. పూర్తి వివరాలు..
ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో నిపుణులైన అభ్యర్థుల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి గాను భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. అంతేకాదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రారంభించింది. అప్లికేషన్‌కి ఇంకొన్ని రోజులే అవకాశం ఉంది. వివిధ విభాగాల్లో మొత్తం 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28 ఫిబ్రవరి 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2026
ఆన్‌లైన్ పరీక్ష (టెంటేటివ్): ఏప్రిల్ 2026
ఇంటర్వ్యూ: ఏప్రిల్ 2026
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు (పోస్టుల వారీగా):
ఈ నియామక ప్రక్రియలో ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫైనాన్స్ విభాగాల్లో కింది ఖాళీలు ఉన్నాయి:
సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Java)- 13
మొబైల్ డెవలపర్ (Android / iOS)- 03
సాఫ్ట్‌వేర్ డెవలపర్ (.NET)- 06
డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్- 11
డిజిటల్ ఛానల్ మేనేజర్- 23
లినక్స్/సోలారిస్/స్టోరేజ్/SRE- 14
విండోస్ / యాక్టివ్ డైరెక్టరీ- 05
క్లౌడ్ మేనేజర్- 05
ఇన్ఫర్మేషన్ / సైబర్ సెక్యూరిటీ- 38
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్- 05
ప్రొడక్షన్ సపోర్ట్ / డిజిటల్ సపోర్ట్- 26
క్లౌడ్ ఆర్కిటెక్ట్- 06
డెవ్‌సెక్ ఆప్స్ (DevSecOps)- 04
వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్- 03
డేటా ఆర్కిటెక్ట్- 02
డేటా ఇంజనీర్ / ETL / PLSQL- 15
డేటా సైంటిస్ట్- 06
జెన్ ఏఐ- స్పెషలిస్ట్ 02
ఐటీ ఆఫీసర్- 82
రిస్క్ మేనేజర్- 04
టాక్సేషన్ / సీఏ- 02
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు..
విద్యార్హత:
ఐటీ పోస్టులకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఈసీఈ / ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
రిస్క్ మేనేజర్: రిస్క్ మేనేజ్‌మెంట్‌లో సంబంధిత డిగ్రీ ఉండాలి.
టాక్సేషన్/సీఏ: చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా టాక్సేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- వయోపరిమితి (గరిష్టంగా)..
స్కేల్ 1: 30 ఏళ్లు
స్కేల్ 2,3: 35 ఏళ్లు
స్కేల్ 4: 45 ఏళ్లు.
(ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- జీత భత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు కింది విధంగా వేతనం లభిస్తుంది:
స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్): రూ. 48,480 – రూ. 85,920
స్కేల్ II (మేనేజర్): రూ. 64,820 – రూ. 93,960
స్కేల్ III (సీనీయర్ మేనేజర్): రూ. 85,920 – రూ. 1,05,280
స్కేల్ 4 (చీఫ్ మేనేజర్): రూ. 1,02,300 – రూ .1,20,940
వీటితో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ అందుతాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం..
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
స్టెప్ 1- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
స్టెప్ 2- 'Specialist Officers Recruitment 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫారమ్ నింపండి.
స్టెప్ 4- ఫొటో, సంతకం, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించండి.
స్టెప్ 5- ఫారమ్ సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


