CBSE Class 10 results : మే కాదు.. ఏప్రిల్​లోనే సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు?

CBSE 10th results 2026 :  సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూల్యాంకనం పూర్తయి, మార్కుల పునఃపరిశీలన జరుగుతోంది. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in వెబ్‌సైట్‌తో పాటు డిజీలాకర్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా పొందవచ్చు.

Published on: Mar 27, 2026, 07:30:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఒక వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్ మధ్య నాటికే ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. సాధారణంగా మే నెలలో వచ్చే ఫలితాలు, ఈసారి సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ముందుగానే విడుదల అవుతాయని సమాచారం.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎప్పుడు? (HT_PRINT)
సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎప్పుడు? (HT_PRINT)

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- వేగంగా ముగిసిన మూల్యాంకనం..

ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మార్చి 11న ముగిశాయి. కాగా ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం ఉపాధ్యాయులు మార్కుల పునఃపరిశీలన (రీ- వెరిఫికేషన్) చేస్తున్నారని తెలుస్తోంది.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు గతేడాది మే 13న ఫలితాలు విడుదలవ్వగా, ఈసారి ఏప్రిల్ 15 లోపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింది అధికారిక వెబ్‌సైట్లలో తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

cbse.gov.in

results.cbse.nic.in

results.digilocker.gov.in

umang.gov.in

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- స్కోర్‌కార్డ్ కోసం కావాల్సిన వివరాలు..

రిజల్ట్స్ చెక్ చేయడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, మరియు పుట్టిన తేదీ (DD/MM/YYYY) వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- ఇంటర్నెట్ లేకపోయినా ఫలితాలు తెలుసుకోవచ్చు!

వెబ్‌సైట్లే కాకుండా ఇతర మార్గాల్లో కూడా సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలను పొందే వెసులుబాటు ఉంది. అవి..

ఎస్​ఎంఎస్​ ద్వారా: cbse10 అని టైప్ చేసి 7738299899 కు సందేశం పంపాలి.

డిజీలాకర్ : విద్యార్థులు తమ డిజిటల్ మార్క్‌షీట్లు, మైగ్రేషన్ సర్టిఫికేట్లను డిజీలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫోన్ కాల్ ద్వారా: దిల్లీ అభ్యర్థులు 24300699 నంబర్‌కు, ఇతర ప్రాంతాల వారు 011-24300699 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- ఫలితాల తర్వాత ప్రక్రియ..

ఫలితాలతో పాటు బోర్డు మొత్తం ఉత్తీర్ణత శాతం, రీజియన్ల వారీగా ఫలితాలు, 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడిస్తుంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం కంపార్ట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఫలితాల రోజే ప్రకటించే అవకాశం ఉంది.

పదో తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్ విద్యకు (ఇంటర్మీడియట్/డిప్లొమా) ఎంతో కీలకం కాబట్టి, విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి కూడా అధికారిక మార్క్‌షీట్లను సేకరించుకోవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- గత కొన్నేళ్లలో సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు వచ్చాయి?

సమాధానం- 2025- మే 13, 2024- మే 123 2023- మే 12.

ప్రశ్న. డిజీలాకర్ (DigiLocker) ద్వారా మార్క్‌షీట్ డౌన్​లోడ్ చేయడానికి 'సెక్యూరిటీ పిన్' ఎక్కడ లభిస్తుంది?

జవాబు: విద్యార్థుల డేటా గోప్యత కోసం సీబీఎస్‌ఈ 6 అంకెల సెక్యూరిటీ పిన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పిన్ నేరుగా మీ పాఠశాల ద్వారా మీకు అందుతుంది. ఫలితాల విడుదలకు ముందే పాఠశాలలు ఈ పిన్ నంబర్లను డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేస్తాయి. డిజీలాకర్‌లో లాగిన్ అయిన తర్వాత, ఈ పిన్ ఎంటర్ చేస్తేనే మీ ఒరిజినల్ మార్క్‌షీట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్​లోడ్ అవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More