...
...
Next Story

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు- దరఖాస్తుకు ఈరోజే లాస్ట్​ ఛాన్స్​..

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటి (జనవరి 5)తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టులు, వయస్సు పరిమితి, విద్యార్హత సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 5, 2026, 06:08:00 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిరుద్యోగులకు అలర్ట్​. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) రిక్రూట్​మెంట్​ ప్రక్రియ నేటితో, జనవరి 5 2026న ముగియనుంది. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 514 క్రెడిట్​ ఆఫీసర్​ పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించడం ఉత్తమం.

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రిక్రూట్​మెంట్- వేకెన్సీ వివరాలు..

బ్యాంకు ఉద్యోగాల అలర్ట్​..
బ్యాంకు ఉద్యోగాల అలర్ట్​..

సీనియర్​ మేనేజ్​మెంట్​​ గ్రేడ్​ స్కేల్​-4 : 36 పోస్టులు

మిడిల్​ మేనేజ్​మెంట్​ గ్రేడ్​ స్కేల్​- 3 : 60 పోస్టులు

మిడిల్​ మేనేజ్​మెంట్​ గ్రేడ్​ స్కేల్​-2 : 418 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య- 518

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రిక్రూట్​మెంట్​- అర్హత వివరాలు..

రిక్రూట్​మెంట్​లో భాగంగా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే, పోస్టుల ప్రాధాన్యతను బట్టి మరికొన్ని వృత్తిపరమైన విద్యార్హతలు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)

చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్​ఏ)

కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (ఐసీడబ్ల్యూఏ)

బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ లేదా పీజీడీబీఎం చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

వయోపరిమితి: నవంబర్ 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు

సీనియర్​ మేనేజ్​మెంట్​​ గ్రేడ్​ స్కేల్​-4 : 25 నుంచి 35ఏళ్లలోపు ఉండాలి.

మిడిల్​ మేనేజ్​మెంట్​ గ్రేడ్​ స్కేల్​- 3 : 28 నుంచి 38ఏళ్లలోపు ఉండాలి.

మిడిల్​ మేనేజ్​మెంట్​ గ్రేడ్​ స్కేల్​-2 : 30 నుంచి 40ఏళ్లలోపు ఉండాలి.

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రిక్రూట్​మెంట్​లో భాగంగా అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా కింది అంశాలపై ప్రశ్నలు ఉంటాయి:

ప్రొఫెషనల్ నాలెడ్జ్ (వృత్తిపరమైన జ్ఞానం)

రీజనింగ్ ఎబిలిటీ

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

క్రెడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అంశాలు

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రిక్రూట్​మెంట్​- దరఖాస్తు చేసుకునే విధానం..

స్టెప్​ 1- ముందుగా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofindia.bank.in సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో ఉన్న 'Careers' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- 'GBO Stream 2025-2026 Recruitment of Credit Officers' లింక్‌ను ఎంచుకోండి.

స్టెప్​ 4- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

స్టెప్​ 5- మీ కేటగిరీని బట్టి నిర్ణీత దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

స్టెప్​ 6- దరఖాస్తు పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రిక్రూట్​మెంట్​కి సంబంధించిన అప్లికేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, గడువు ముగిసేలోపే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks