Team India: రూ.131 కోట్ల బోనస్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్స్‌పై కాసుల వర్షం

Team India: టీ20 వరల్డ్ కప్ ను ముచ్చటగా మూడోసారి గెలిచిన టీమిండియాపై కాసుల వర్షం కురిపించింది బీసీసీఐ. ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత భారీ మొత్తంలో రివార్డు అనౌన్స్ చేయకపోవడం గమనార్హం.

Published on: Mar 10, 2026, 13:37:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత గడ్డపై సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు బీసీసీఐ కళ్లు చెదిరే బహుమతిని ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు ఏకంగా రూ. 131 కోట్ల భారీ క్యాష్ రివార్డ్‌ను అందజేయనున్నట్లు మంగళవారం (మార్చి 10) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Team India: రూ.131 కోట్ల బోనస్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్స్‌పై కాసుల వర్షం
Team India: రూ.131 కోట్ల బోనస్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్స్‌పై కాసుల వర్షం

ఈ క్యాష్ రివార్డ్ ఎవరెవరికి దక్కుతుందంటే?

మెగా టోర్నీలు గెలిచినప్పుడు జట్టుకు భారీ నజరానాలు ఇవ్వడం బీసీసీఐకి ఆనవాయితీగా వస్తోంది. ఈ తాజా రూ. 131 కోట్ల బోనస్‌ను ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, నేషనల్ సెలెక్టర్ల మధ్య పంచుతారు. ఆ లెక్కన అందరూ జాక్ పాట్ కొట్టినట్లే. గతంలో ఏ మెగా టోర్నీ గెలిచిన సందర్భంలోనూ ఈస్థాయిలో బీసీసీఐ క్యాష్ ప్రైజ్ ఇవ్వలేదు.

గత కొన్నేళ్లలో బీసీసీఐ ఇచ్చిన భారీ రివార్డ్స్

2024 టీ20 వరల్డ్ కప్: రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ గెలిచిన జట్టుకు రూ. 125 కోట్లు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ: మరుసటి ఏడాదే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు టీమిండియాకు రూ. 58 కోట్లు.

2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్: ట్రోఫీ సాధించిన భారత మహిళల జట్టుకు రూ. 51 కోట్లు.

గౌతమ్ గంభీర్, సూర్యలకు ప్రశంసలు

ఈ అద్భుతమైన విజయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ స్పందిస్తూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. "పురుషుల టీ20 వరల్డ్ కప్ గెలవడం యావత్ దేశానికే ఎంతో గర్వకారణం. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి, టైటిల్ నిలబెట్టుకోవడం మరింత స్పెషల్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో, సూర్యకుమార్ యాదవ్ లీడర్‌షిప్‌లో టోర్నీ ఆసాంతం జట్టు అద్భుతంగా ఆడింది. ఈ అపురూప విజయం సాధించిన ప్రతి ప్లేయర్‌కు, కోచింగ్ స్టాఫ్‌కు, సెలెక్టర్లకు నా ప్రత్యేక అభినందనలు," అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వరల్డ్ కప్‌లో సూర్య సేన రికార్డులు ఇవే..

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచుల్లో 8 గెలిచి అన్-స్టాపబుల్‌గా నిలిచింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లో 90 వేల మంది ఫ్యాన్స్ కేరింతల మధ్య జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో పలు సంచలన రికార్డులు చేరాయి.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2007లో ఎంఎస్ ధోనీ, 2024లో రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్.. ఇలా మొత్తంగా మూడు టీ20 వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక జట్టుగా టాప్‌లో నిలిచింది. హోస్ట్ నేషన్‌గా (ఆతిథ్య దేశంగా) ఉండి టీ20 వరల్డ్ కప్ గెలవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఏ హోస్ట్ నేషన్ కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More