Samson-Surya: టేక్ ఏ బో శాంసన్-టోపీ తీసి తలవంచిన సూర్యకుమార్-ప్రతి ఇండియన్ ఫీలింగ్ అదే-వీడియో వైరల్
Samson-Surya: టీ20 ప్రపంచకప్ లో ఇండియా అదరగొట్టింది. అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్ చేరింది. వెస్టిండీస్ తో పోరులో చెలరేగిన సంజు శాంసన్ ఒంటిచేత్తో టీమ్ ను గెలిపించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత టేక్ ఏ బో అంటూ శాంసన్ ముందు సూర్యకుమార్ తల వంచాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా అదరగొట్టింది. సూపర్ 8లో తన లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించి సెమీఫైనల్ కు అర్హత సాధించింది. ఆదివారం (మార్చి 1) రాత్రి ముగిసిన ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ హీరో. అమేజింగ్ బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. దీంతో శాంసన్ కు కెప్టెన్ సూర్యకుమార్ తలవంచిన వీడియో వైరల్ గా మారింది.

శాంసన్ కోసం సూర్య
ఆదివారం రాత్రి ముగిసిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ పోరు ఉత్కంఠ రేకెత్తింది. ఈ మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 97 రన్స్ తో నాటౌట్ గా నిలిచి భారత్ ను గెలిపించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ డగౌట్ వైపు వెళ్లే క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.
ప్రతి ఇండియన్
టీమ్ ను గెలిపించిన తర్వాత మిక్స్ డ్ ఎమోషన్లతో పెవిలియన్ వైపు కదిలిన సంజు శాంసన్ కు కెప్టెన్ సూర్యకుమార్ సహా టీమ్ మెంబర్స్ ఎదురుగా వచ్చారు. ముందుగా వచ్చిన సూర్యకుమార్ తన టోపీ తీసి తల వంచాడు. శాంసన్ కోసం టేక్ ఏ బో గెస్చర్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ సమయంలో సూర్య చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఇండియన్ ఫీలింగ్ అదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
శాంసన్ ది హీరో
అసలు టీమ్ లో ప్లేస్ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఇండియా హీరోగా మారాడు శాంసన్. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండటంతో టీ20 ప్రపంచకప్ కోసం అభిషేక్ తో కలిసి అతణ్ని ఓపెనర్ గా ఆడించారు. దీంతో శాంసన్ కు టీమ్ లో ప్లేస్ దక్కలేదు. ఈ పొట్టి కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో అమెరికాపై అభిషేక్, ఇషాన్ ఓపెనింగ్ చేశారు.
అభిషేక్ దూరం
కడుపు నొప్పితో నమీబియాతో మ్యాచ్ కు అభిషేక్ దూరమయ్యాడు. దీంతో శాంసన్ కు ఛాన్స్ వచ్చింది. కానీ 22 రన్స్ చేసి ఔటైపోయాడు. అభిషేక్ కోలుకొని రావడంతో శాంసన్ కు మళ్లీ టీమ్ లో చోటు దక్కలేదు. అయితే అపోనెంట్ టీమ్స్ ఫస్ట్ ఓవర్లోనే ఆఫ్ స్పిన్నర్ తో ఓపెనర్లకు ట్రాప్ సెట్ చేస్తుండటంతో సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్ కోసం రైట్ హ్యాండర్ శాంసన్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.
జింబాబ్వేతో మ్యాచ్ లో శాంసన్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ శాంసన్ కు కూడా డూ ఆర్ డైగా మారింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తన కెరీర్ ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


