ఇండియా కోసం ఈ విక్టరీ.. డిక్లేర్ చేసిన సూర్యకుమార్ .. పాకిస్థాన్ ఓటమిని చూడలేక ముందే వెళ్లిపోయిన మోసిన్ నఖ్వీ

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాకిస్తూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ ఇండియా కోసం అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిక్లేర్ చేశాడు. పాక్ ఓటమిని చూడలేక పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మోసిన్ నఖ్వీ మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు.

Published on: Feb 16, 2026, 06:21:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అదే ఆధిపత్యం.. అదే విజయం. టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను టీమిండియా మరోసారి చిత్తుచేసింది. ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ముగిసిన మ్యాచ్ లో ఇండియా 61 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ ఇండియా కోసం అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిక్లేర్ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ (PTI)
సూర్యకుమార్ యాదవ్ (PTI)

ఇండియా కోసం

పాకిస్థాన్ పై విక్టరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘ఇది ఇండియా కోసం’ అని అతను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ పై సూర్య ప్రశంసలు కురిపించాడు.

‘‘ఇది ఇండియా కోసం. మేం అనుకున్నట్లుగానే ఆడాం. ఈ వికెట్ పై ముందు బ్యాటింగ్ చేయడం మంచిదని టాస్ సమయంలో కూడా చెప్పా. ఇషాన్ ఆడిన తీరు అద్భుతం. ఇషాన్ కొత్తగా ఆలోచించాడు. పవర్ ప్లేలో ఎవరో ఒకరు చెలరేగాలి. ఇషాన్ ఆ బాధ్యత తీసుకున్నాడు. తిలక్, శివమ్, రింకు బ్యాటింగ్ ను కూడా మెచ్చుకోవాల్సిందే’’ అని సూర్యకుమార్ తెలిపాడు.

బెస్ట్ బౌలర్

‘‘మేం ఫస్ట్ 175 రన్స్ చేసినప్పుడే మంచి స్కోరు చేశామని అనుకున్నా. ఓ 20 రన్స్ ఎక్కువే చేశామనిపించింది. హార్దిక్ కొత్త బాల్ తో ఛార్జ్ తీసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా చెలరేగిపోయాడు. అతను ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని మరోసారి చాటాడు. ఆ తర్వాత అక్షర్, వరుణ్, కుల్ దీప్ బౌలింగ్ లో అదరగొట్టారు. తిలక్ కూడా సహకరించాడు’’ అని సూర్య పేర్కొన్నాడు.

మధ్యలోనే మోసిన నఖ్వీ

టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేద్దామనుకున్నాం కానీ ఐసీసీ రిక్వెస్ట్ తో ఆడేందుకు ఒప్పుకొన్నామని తెగ బిల్డప్ ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన నఖ్వీకి తీవ్ర పరాభవం ఎదురైంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు అతను కొలంబోలోని స్టేడియానికి వచ్చాడు. కానీ ఇండియా చేతిలో పాక్ చిత్తవుతుంటే చూడలేక మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు.

గ్రాండ్ విక్టరీ

టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఎ పోరులో పాకిస్థాన్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బాల్స్ లోనే 77 రన్న్ కొట్టాడు. స్పిన్ ట్రాప్ లో భారత్ ను పడేయాలని పాక్ చూసింది. ఆ టీమ్ స్పిన్నర్లు ఏకంగా 18 ఓవర్లు వేశారు. కానీ ఇషాన్ మెరుపులతో భారత్ మంచి స్కోరు సాధించింది.

ఛేజింగ్ లో పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు దూసుకెళ్లింది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More