Ind vs Pak: నెదర్లాండ్స్ పై విక్టరీ.. టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో ఇండియా ప్రత్యర్థులు వీళ్లే..పాకిస్థాన్ తో మ్యాచ్ ఉంటుందా?
టీ20 ప్రపంచకప్ లో ఇండియా డామినెన్స్ కొనసాగుతోంది. తన చివరి గ్రూప్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై గెలిచిన భారత్ అజేయంగా సూపర్ 8కు దూసుకెళ్లింది. మరి సూపర్ 8లో ఇండియా ప్రత్యర్థులు ఎవరు? పాకిస్థాన్ తో మరో మ్యాచ్ ఉంటుందా లేదా? ఇక్కడ చూసేయండి.
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన ఇండియా అంచనాలను అందుకుంటూ అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీని అజేయంగా ముగించింది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై విజయాలు సాధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) రాత్రి ముగిసిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన భారత్ తన అన్ బీటెన్ రన్ కంటిన్యూ చేసింది.

సూపర్ 8 టీమ్స్
టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 చేరిన టీమ్స్ పై క్లారిటీ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక టీమ్స్ సూపర్ 8లో అడుగుపెట్టాయి. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించింది.
సూపర్ 8 గ్రూప్స్
సూపర్ 8 చేరిన టీమ్స్ ను రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి.
ఇండియా వర్సెస్ పాక్
ఐసీసీ టోర్నీ ఏదైనా క్రికెట్ లవర్స్ అందరూ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తారు. ఈ టీ20 ప్రపంచకప్ లోనూ అందరూ ఈ మ్యాచ్ కోసం చూశారు. గ్రూప్-ఎలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు పోటీపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ ను భారత్ 61 రన్స్ తేడాతో చిత్తుచేసింది.
మళ్లీ పోరు
టీ20 ప్రపంచకప్ లో మళ్లీ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుందా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ రెండు టీమ్స్ సూపర్ 8కు అర్హత సాధించాయి. అయితే ఇండియా, పాక్ సూపర్ 8లో తలపడే ఛాన్స్ లేదు. రెండు వేర్వేరు గ్రూప్ ల్లో ఉన్నాయి. గ్రూప్ 1లో భారత్, గ్రూప్ 2లో పాకిస్థాన్ ఉన్నాయి. సూపర్ 8లో ఆయా టీమ్స్ తమ గ్రూప్ లోని ప్రత్యర్థులతో మాత్రమే మ్యాచ్ లు ఆడతాయి.
మరి ఛాన్స్ ఉందా?
సూపర్ 8లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లేకపోయినా ఈ టీ20 ప్రపంచకప్ లో మరోసారి ఈ రెండు టీమ్స్ తలపడే ఛాన్స్ లేకపోలేదు. గ్రూప్ 1లో ఇండియా టాప్ ప్లేస్ లో, గ్రూప్ 2లో పాక్ సెకండ్ ప్లేస్ లో నిలిస్తే ఈ రెండు టీమ్స్ ఫస్ట్ సెమీస్ ఆడతాయి. లేదా ఇండియా గ్రూప్ 1లో సెకండ్ ప్లేస్ లో, పాక్ గ్రూప్ 2లో ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే ఇండియా, పాక్ సెకండ్ సెమీస్ ఆడతాయి.
ఒకవేళ ఈ రెండు టీమ్స్ సెమీస్ చేరి, అక్కడ వేర్వేరు టీమ్స్ తో ఆడి గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్లో ఢీ కొనే ఛాన్స్ ఉంది.
సూపర్ 8 పూర్తి షెడ్యూల్
- ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్థాన్
- ఫిబ్రవరి 22: శ్రీలంక vs ఇంగ్లాండ్
- ఫిబ్రవరి 22: భారత్ vs దక్షిణాఫ్రికా
- ఫిబ్రవరి 23: వెస్టిండీస్ vs జింబాబ్వే
- ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్ vs పాకిస్థాన్
- ఫిబ్రవరి 25: శ్రీలంక vs న్యూజిలాండ్
- ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్
- ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే
- ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్
- ఫిబ్రవరి 28: శ్రీలంక vs పాకిస్థాన్
- మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే
- మార్చి 1: భారత్ vs వెస్టిండీస్
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


