ఇది తెలుసా? పాకిస్థాన్ కెప్టెన్ జీతం కంటే హార్దిక్ పాండ్య వాచ్ ఖరీదు మూడు రెట్లు ఎక్కువ.. ఇదీ మీ స్థాయి అంటూ ట్రోల్స్
ఆటలోనే కాదు ఆదాయంలోనూ ఇండియన్ ప్లేయర్ల కంటే పాకిస్థాన్ క్రికెటర్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. పాక్ కెప్టెన్ జీతం కంటే హార్దిక్ పాండ్య పెట్టుకున్న వాచ్ ఖరీదు మూడు రేట్లు ఎక్కువ!
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఇక భారత ఆటగాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో మన క్రికెటర్లపై ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆటే కాదు ఆదాయం పరంగా చూసుకున్నా మన ఇండియన్ క్రికెటర్లకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో దూరంలో ఉన్నారు. హార్దిక్ పాండ్య పెట్టుకున్న వాచ్ రేటు పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ఎక్కవగా ఉండటం విశేషం.

హార్దిక్ పాండ్య వాచ్
రీసెంట్ గా టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు జరిగింది. ఇందులో అదిరే ఆటతో అదరగొట్టిన భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య చేతికి పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది. శివుడి ఫొటోతో స్కై బ్లూ కలర్ లో ఉన్న ఈ వాచ్ రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. దీని ముందు పాకిస్థాన్ కెప్టెన్ సాలరీ చాలా తక్కువ.
వాచ్ రేట్
పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్య ప్రత్యేకమైన జాకబ్ & కో ఎపిక్ X స్పోర్ట్ 'రుద్ర' ఎడిషన్ వాచ్ ను పెట్టుకున్నాడు. ఈ లగ్జరీ టైమ్‌పీస్ ధర పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నెలవారీ జీతం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని తెలిసింది. ఈ వాచ్ రేటు ధర $28,000 (సుమారు రూ.25,35,000) కాగా.. సల్మాన్ అఘాకు పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం నెలకు రూ.7 లక్షలు మాత్రమే వస్తుంది.
25 పీస్ లు
'ది ఇండియన్ హారాలజీ' ప్రకారం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జాకబ్ & కో ఎపిక్ X స్పోర్ట్ ప్రత్యేకమైన 'రుద్ర' ఎడిషన్ వాచ్ ను చేతికి పెట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం 25 పీస్ లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇలాంటి వాచ్ లు మొత్తం 25 మాత్రమే. ఇది లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్.
శివుడి ఫొటోతో
41mm గ్రేడ్ 5 టైటానియం కేస్‌లో 11.5mm సన్నని ప్రొఫైల్, 50 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ తో ఉన్న ఈ లైట్ వెయిట్ వాచ్ చూడటానికి అద్భుతంగా ఉంది. దీని కోర్ లో ఇన్-హౌస్ ఆటోమేటిక్ కాలిబర్ JCHA01 ఉంది. ఇది 4Hz వద్ద 70 గంటల పవర్ రిజర్వ్‌తో పనిచేస్తుంది. రుద్ర రూపంలో వాచ్ మధ్యలో ఉన్న శివుడి ఫొటో ఈ వాచ్ కు మరింత శక్తిని, ఆకర్షణను తీసుకొచ్చింది. శివరాత్రి రోజు జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ఈ వాచ్ పెట్టుకున్నాడు.
ఇది మీ స్థాయి
హార్దిక్ వాచ్ కంటే పాకిస్థాన్ కెప్టెన్ జీతం మూడు రెట్లు తక్కువ అనే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ స్థాయి ఇదేనంటూ పాక్ క్రికెటర్లపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నిజం తెలుసుకోలేక ఇండియాతో అనవసరంగా పెట్టుకుంటారని ట్రోల్స్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


