ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. మీ వల్లే ఆడాం.. మీరే హీరో.. భారత్‌తో స‌మ‌స్య‌లు: మోసిన్ న‌ఖ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2026 టీ20 ప్రపంచకప్ లో మొదట ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరకు భారత్ తో ఆడిన పాక్ చిత్తుచిత్తుగా ఓడింది. అయితే ఈ మ్యాచ్ హీరో అతనే అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

Published on: Feb 18, 2026, 08:14:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో సమస్యలున్నా ఈ మ్యాచ్ ఆడామంటే అందుకు కారణం శ్రీలంక అధ్యక్షుడేనని మోసిన్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఉన్న మోసిన్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చేతకానివాడి చేతికి పీసీబీ అప్పగించారని పాక్ మాజీలు రెచ్చిపోతున్నారు.

మోసిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు (PTI)
మోసిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు (PTI)

మోసిన్ నఖ్వీ కామెంట్లు

2026 టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసానాయకే అని మోసిన్ నఖ్వీ చెప్పుకొచ్చాడు. శ్రీలంక అధ్యక్షుడి నుండి పిలుపు వచ్చిన తర్వాతే పాకిస్థాన్ నాయకత్వం ఈ మ్యాచ్ పై ఏకాభిప్రాయానికి వచ్చిందని నఖ్వీ తెలిపాడు. శ్రీలంక అధ్యక్షుడు జోక్యం చేసుకునే వరకు కూడా మ్యాచ్ ఆడే విషయంలో మేం 50-50గానే ఉన్నామని పేర్కొన్నాడు.

మీరో హీరే

‘‘పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి నుంచి మీకు (శ్రీలంక అధ్యక్షుడు) అభినందనలు. వారు ప్రత్యేకంగా మీకు నా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. నిజానికి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో మీరే అసలైన హీరో. ఎందుకంటే మీ వల్ల 2 బిలియన్ల మంది వినోదం పొందారు’’ అని మోసిన్ నఖ్వీ అన్నాడు.

భారత్ తో సమస్య

భారత్ తో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్థాన్ కు సమస్యలు ఉన్నాయని మోసిన్ నఖ్వీ అన్నాడు. కానీ శ్రీలంక అధ్యక్షుడు పిలుపుతో అంతా మారిపోయిందని పేర్కొనడం గమనార్హం.

‘‘భారత్‌తో ఆడే విషయంలో మాకు చాలా సమస్యలున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు పాకిస్థాన్ ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం మారింది. ప్రధానమంత్రి మీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే మనం మ్యాచ్ ఆడుతున్నామని చెప్పారు. ’’ అని మోసిన్ నఖ్వీ పేర్కొన్నాడు.

ట్రోల్స్

మోసిన్ నఖ్వీ కామెంట్లపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇండియాతో మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక కారణంగానే మ్యాచ్ ఆడామని, ఆ నిందను ఆ దేశంపై తోసేయాలని పాక్ చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మోసిన్ నఖ్వీపై పాక్ మాజీలు గుర్రుగా ఉన్నారు. పాకిస్థాన్ తనంతట తానే దిగివచ్చి ఇండియాతో మ్యాచ్ ఆడిందని చెప్తే పరువు పోతుందని మోసిన్ కవర్ చేస్తున్నాడనే ట్రోల్స్ వస్తున్నాయి.

పాక్ చిత్తు

టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో చిత్తయింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 77 రన్స్ తో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో ఓటమితో పాక్ టీమ్ పై సొంత ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More