Sanju Samson: 60 మ్యాచ్‌లే ఆడానేమో-కానీ డ‌గౌట్లో కూర్చుని 100 మ్యాచ్‌లు చూశా-నేను ఎదురుచూసిన రోజు ఇదే: సంజు శాంసన్

Sanju Samson: సంజు శాంసన్ అద్భుతమే చేశాడు. టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఇండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: Mar 2, 2026, 06:24:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సంజు శాంసన్.. భారత క్రికెట్లో ఈ పేరు ఇప్పుడో సంచలనం. టాలెంట్ ఉన్నా నిలకడ లేకపోవడంతో టీమ్ లోకి వస్తూ, వెళ్తూ ఉండే ఆటగాడిగా శాంసన్ కు పేరు ఉంది. కానీ ఆదివారం (మార్చి 1) అతను అద్భుతం చేశాడు. తన కెరీర్‌ను మార్చేసే ఇన్నింగ్స్ ఆడి, భారత్‌ను టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి చేర్చాడు. వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో ఇండియాను గెలిపించాడు.

సంజు శాంసన్ (Hindustan Times)
సంజు శాంసన్ (Hindustan Times)

కోహ్లి రికార్డు బ్రేక్

టీ20 ప్రపంచకప్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డును సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో 196 పరుగుల ఛేజింగ్ లో శాంసన్ 97 నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ లో ఛేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. కోహ్లి 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్ పై 82 పరుగుల చొప్పున చేశాడు.

సంజు శాంసన్ కామెంట్లు

11 సంవత్సరాల క్రితం భారత్ తరపున టీ20 డెబ్యూ చేసిన సంజు శాంసన్.. వెస్టిండీస్ పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత ఎమోషనల్ అయ్యాడు. "ఈ ఇన్నింగ్సే నాకు ఇప్పుడు ప్రపంచం లాంటిది. క్రికెట్ మొదలెట్టినప్పటి నుంచే దేశం కోసం ఆడాలని కలలు కన్నా. నేను ఎదురు చూస్తున్న రోజు ఇది. నా జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను చేయగలనా లేదా అని నాపై నాకు అనుమానాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సాధించా. ఎంతో సంతోషంగా ఉంది’’ అని సంజు శాంసన్ తెలిపాడు.

బయట కూర్చుని

"నేను చాలా కాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా. బెంచ్‌పై కూర్చుని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నా. వాళ్లు ఎలా ఆడుతున్నారో గమనించడం నాకు చాలా ఉపయోగపడింది. నేను 60 మ్యాచ్ లే ఆడాను. కానీ డగౌట్లో కూర్చుని 100 మ్యాచ్ లు చూశా’’ అని సంజు శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

డూ ఆర్ డై మ్యాచ్

టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా వెస్టిండీస్ పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డూ ఆర్ డై పోరులో సంజు శాంసన్ మేటి ఇన్నింగ్స్ తో భారత్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేజింగ్ లో శాంసన్ చెలరేగడంతో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఇండియా టార్గెట్ రీచ్ అయింది. మార్చి 5న సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఆడనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More