T20 World Cup: జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ.. మారిన సెమీస్ సమీకరణాలు.. ఇండియా అలా చేస్తే చాలు.. నాకౌట్ మ్యాచ్!
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో జింబాబ్వేపై ఘన విజయంతో సెమీస్ అవకాశాలను భారత్ మెరుగుపర్చుకుంది. మరోవైపు వెస్టిండీస్ ను దక్షిణాఫ్రికా ఓడించడమూ ఇండియాకు కలిసొచ్చింది. మరి భారత్ సెమీస్ చేరాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఓ లుక్కేయండి.
టీ20 ప్రపంచకప్ 2026లో ఫ్యాన్స్ కు ఇండియన్ క్రికెట్ టీమ్ భలే కిక్ ఇచ్చింది. అత్యంత అవసరమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి ముగిసిన మ్యాచ్ లో జింబాబ్వేను 72 రన్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ గ్రాండ్ విక్టరీతో టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ ఛాన్స్ మరింత మెరుగయ్యాయి.

ఇండియా గ్రాండ్ విక్టరీ
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో భారత్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 256/4 భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్య 50 నాటౌట్, తిలక్ వర్మ 44 రన్స్ తో అదరగొట్టారు. ఛేజింగ్ లో జింబాబ్వే 184/6 స్కోరుకు పరిమితమైంది. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా విజయంతో
ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ కంటే ముందు వెస్టిండీస్ ను దక్షిణాఫ్రికా ఓడించడమూ ఇండియాకు కలిసొచ్చింది. ఒకవేళ వెస్టిండీస్ గెలిచి ఉంటే నెట్ రన్ రేట్ పరంగా భారత్ కు షాక్ తగిలేది. ఇప్పుడు సూపర్ 8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్ ల్లోనూ గెలిచి 4 పాయింట్లు, 2.890 నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిన వెస్టిండీస్ (2 పాయింట్లు, 1.791 నెట్ రన్ రేట్) రెండో ప్లేస్ లో ఉంది. ఇండియా ఏమో ఒక ఓటమి, ఒక విజయంతో 2 పాయింట్లు, -0.100 నెట్ రన్ రేట్ తో మూడో ప్లేస్ లో ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే
గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంది. జింబాబ్వే రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం వెస్టిండీస్, ఇండియా మధ్య ఫైట్ నెలకొంది. ఈ రెండు టీమ్స్ మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన టీమ్ సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిందే.
అంటే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ చేరాలంటే వెస్టిండీస్ ను కచ్చితంగా ఓడించాలి. ఇక్కడ నెట్ రన్ రేట్ తో అవసరం లేదు. కేవలం ఇండియా విజయం సాధిస్తే సరిపోతుంది. ఈ మ్యాచ్ ఇండియాకు నాకౌట్ లాంటిదే. ఓడిపోతే ఇంటి ముఖం పట్టాల్సిందే. టీమిండియా సెమీస్ చేరుతుందో లేదా సూపర్ 8లోనే నిష్క్రమిస్తుందో అన్నది మార్చి 1, ఆదివారం తేలనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


