India vs Zimbabwe: ఇండియా వర్సెస్ జింబాబ్వే.. ఇవాళ టీ20 ప్రపంచకప్ లో భారత్ కు డూ ఆర్ డై.. ఓడితే ఇంటికే..కూనతో జాగ్రత్త!

ఏదో అనుకుంటే ఇంకేదో అయింది! భారీ ఆశలు, అంచనాలతో టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన ఇండియా ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది. ఇవాళ సూపర్ 8లో జింబాబ్వేతో భారత్ ఆడనుంది. ఓడితే అంతే సంగతి. కూన అని ఓవర్ కాన్పిడెంట్ కు పోకుండా టీమిండియా భారీ విజయం సాధించాల్సిందే.

Published on: Feb 26, 2026, 09:01:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్. టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా ఈ రోజు జింబాబ్వేతో ఆడనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో గురువారం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే టీమిండియా ఇంటి ముఖం పట్టాల్సిందే!

ప్రాక్టీస్ లో ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ (PTI)
ప్రాక్టీస్ లో ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ (PTI)

ఇండియా వర్సెస్ జింబాబ్బే

టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. టైటిల్ ఆశలు మిగలాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇవాళ జింబాబ్వేను ఢీ కొడుతుంది. ఈ సూపర్ 8 మ్యాచ్ లో కేవలం విక్టరీ మాత్రమే కాదు ఇండియా భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్ లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.

భారత్ పరిస్థితి ఇలా

భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ లో ఇండియా అడుగుపెట్టింది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది. గ్రూప్-ఎలో టాప్ ప్లేస్ తో సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కానీ సూపర్ 8లో తొలి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయింది. దీంతో -3.800 రన్ రేట్ తో వెస్టిండీస్ (5.350), దక్షిణాఫ్రికా (3.800) తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.

టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీస్ ఆశలు నిలవాలంటే జింబాబ్వేపై కేవలం విక్టరీ సరిపోదు. భారీ తేడాతో గెలవాలి. అందుకోసం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగాల్సి ఉంటుంది.

టీమ్ లో మార్పులు

జింబాబ్వేతో మ్యాచ్ కోసం ఇండియా తన ఫైనల్ ఎలెవన్ లో కొన్ని మార్పులు చేసే అవకాశముంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి రావడం ఖాయమే. ఇక స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై మూడో స్పిన్నర్ గా కుల్ దీప్ ను ఆడించే ఛాన్స్ ఉంది.

మరోవైపు తండ్రి అనారోగ్యం కారణంతో ఇంటికి వెళ్లిన రింకు సింగ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ అతను తిరిగి టీమ్ లోకి వస్తే తిలక్ వర్మను తప్పించి సంజు శాంసన్ ను టాప్ లో ఆడించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

జింబాబ్వేతో జాగ్రత్త

టీమిండియాతో పోలిస్తే జింబాబ్వే పసికూననే. కానీ ఆ టీమ్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. అందుకే ఓవర్ కాన్ఫిడెంట్ కు పోకుండా 100 శాతం ఆటతీరుతో భారీ విజయం సాధించాల్సిన అవసరం భారత్ కు ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More