ట్రాఫిక్​లో హార్న్​ కొట్టాడని- స్కూటర్​ని కారుతో ఢీకొట్టాడు! చిన్నారి సహా తల్లిదండ్రులకు..

బెంగళూరులో.. కుటుంబం ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టి పారిపోయిన యువకుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ట్రాఫిక్​లో హార్న్​ కొట్టడంతో కోపం వచ్చిందని, అందుకే కారుతో స్కూటర్​ని ఢీకొట్టినట్టు ఆ యువకుడు చెప్పడం గమనార్హం.

Published on: Nov 14, 2025, 06:07:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరులో జరిగిన ఓ షాకింగ్​ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! ఓ కుటుంబాన్ని తీసుకెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో వేగంగా ఢీకొట్టిన అనంతరం, ఓ వ్యక్తి ఘటనాస్థలం అక్కడి నుంచి పారిపోయాడు. తాజాగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో షాకింగ్​ ఘటన!
బెంగళూరులో షాకింగ్​ ఘటన!

అసలేం జరిగిందంటే..

ఈ దారుణ సంఘటన గత నెలలో ఎం.ఎస్. రామయ్యా ఆసుపత్రి సమీపంలో జరిగింది. అప్పుడు భార్యాభర్తలతో పాటు వారి చిన్నారి స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. కారు నడుపుతున్న 23 ఏళ్ల సుకృత్ అనే యువకుడు స్కూటర్‌ను అతి వేగంతో ఢీకొట్టాడు.

తాకిడి బలంగా ఉండడంతో, స్కూటర్ అదుపుతప్పి డివైడర్ పై నుంచి ఎగిరి పడింది. స్కూటర్​ మీద ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం గాయపడింది.

ఈ ఘటనలో మహిళకు చేయి, తల, భుజాలపై గాయాలయ్యాయి. పురుషుడికి పక్కటెముకలకు దెబ్బ తగిలింది.వెంటనే అప్రమత్తమైన అటుగా వెళున్న ప్రయాణికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

సీసీటీవీ ద్వారా నిందితుడి గుర్తింపు..

సంఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు కారు నంబర్‌ను గుర్తించి, నిందితుడు సుకృత్‌ను పట్టుకున్నారు.

అనంతరం అతడిని అరెస్టు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, గాయాలకు కారణం కావడం, ప్రమాదం జరిగిన తర్వాత పారిపోవడం వంటి సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోపంతోనే ఢీకొట్టాడా?

స్కూటర్​ని కారు ఢీకొట్టడానికి గల కారణంపై పోలీసులకు ఒక విషయాన్ని చెప్పాడు నిందితుడు సుకృత్. ఘటన జరగడానికి కొంతసేపటి ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్కూటర్ నడుపుతున్న వ్యక్తి తనను చూసి హారన్ కొట్టడం తనకు కోపం తెప్పించిందని, అందుకే ఉద్దేశపూర్వకంగానే స్కూటర్‌ను కారుతో ఢీకొట్టినట్టు చెప్పాడు!

ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి రాష్ డ్రైవింగ్ కేసుల నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More