ఉద్యోగాలు ఊడటం ఒక ఎత్తైతే, ఆ తర్వాత కంపెనీల నుంచి ఎదురయ్యే అనుభవాలు ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తుంటాయి. ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక టెకీకి ఇలాంటి తీవ్ర అసంతృప్తికర అనుభవమే ఎదురైంది. లేఆఫ్‌కు గురైన అతడు, ఆఫీస్ లాప్‌టాప్ తిరిగి ఇచ్చేందుకు తన రెండేళ్ల కుమారుడితో వెళ్లగా, ఆ చిన్నారిని భవనంలోకి అనుమతించలేదు.

సదరు ఉద్యోగి రెడిట్ (Reddit) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. భార్య కూడా ఉద్యోగం చేస్తుండటంతో, ఇంట్లో పిల్లాడిని చూసుకునేవారు లేక తప్పనిసరి పరిస్థితుల్లో తన రెండేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.
సెక్యూరిటీ నిరాకరణ.. కొలీగ్ సాయం
ఆఫీస్ ప్రాంగణానికి చేరుకోగానే పిల్లాడిని లోపలికి రానివ్వమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. "ఇది నా చివరి రోజు, కేవలం లాప్‌టాప్ ఇచ్చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను" అని వేడుకున్నా కంపెనీ విజిటర్ పాలసీ నిబంధనల ప్రకారం కుదరదని తేల్చి చెప్పారు.
దిక్కుతోచని స్థితిలో ఒక సహోద్యోగికి ఫోన్ చేసి పిలిపించి, పిల్లాడిని కొద్దిసేపు చూసుకోమని కోరాడు. 5 నిమిషాల్లో పూర్తవుతుందనుకున్న ప్రక్రియకు 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిల్లాడిని బయట ఉంచి తీవ్ర మనోవేదనకు గురయ్యానని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
కంపెనీలు మన కుటుంబం కావు
ఈ ఘటనపై అతడు స్పందిస్తూ, కంపెనీ నిబంధనలను తప్పుపట్టడం లేదని పేర్కొన్నాడు. అయితే, "కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. నీ వ్యక్తిగత పరిస్థితులతో వారికి సంబంధం ఉండదు" అనే కఠిన నిజం తనకు అర్థమైందని రాసుకొచ్చాడు. ఎంతకాలం రాత్రింబవళ్లు కష్టపడినా, కంపెనీని సొంత కుటుంబంలా భావించినా.. చివరికి అది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమేనని గుర్తుచేశాడు. ఉద్యోగం కంటే కుటుంబం, వ్యక్తిగత జీవితమే అత్యంత ముఖ్యమని హితవు పలికాడు.
నెటిజన్ల మద్దతు.. కార్పొరేట్ తీరుపై మండిపాటు
ఈ రెడిట్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. "నేనైతే బిల్డింగ్ లాబీ నుంచే హెచ్ఆర్కు ఫోన్ చేసి, బయటకే వచ్చి మీ వస్తువులు తీసుకెళ్లమని చెప్పేవాడిని" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
{{/usCountry}}ఈ రెడిట్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. "నేనైతే బిల్డింగ్ లాబీ నుంచే హెచ్ఆర్కు ఫోన్ చేసి, బయటకే వచ్చి మీ వస్తువులు తీసుకెళ్లమని చెప్పేవాడిని" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
{{/usCountry}}"మీ ఉద్యోగం పోతే కంపెనీలు మరో క్షణంలో వేరేవారిని తీసుకుంటాయి. కానీ మీ కుటుంబం మిమ్మల్ని రీప్లేస్ చేయలేదు. మీ ఆరోగ్యం, ప్రశాంతతను ఏ కంపెనీ కోసం త్యాగం చేయకండి" అని మరొకరు పేర్కొన్నారు.
"కంపెనీని మీ కుటుంబంగా భావించడం ఇప్పటికైనా ఆపండి. చెప్పిన పని మాత్రమే చేయండి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
"నేను లేఆఫ్ అయినప్పుడు లాప్‌టాప్‌ను కొరియర్ ద్వారా పంపేశాను. కంపెనీలు ఉద్యోగుల గురించి పట్టించుకోవు, కేవలం తోటి ఉద్యోగులు మాత్రమే మానవీయంగా స్పందిస్తారు" అని మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.