బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీష్‌కే మళ్లీ పట్టం
Nov 14, 2025, 16:40:45 IST
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల్లో మొత్తం 243 సీట్లకు గాను 180కి పైగా సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా, మహా కూటమి 36 సీట్లకు పరిమతమైంది. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Summary
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే ఘన విజయం.. కూటమి 36 సీట్లకు పరిమితం.

బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీష్‌కే మళ్లీ పట్టం
బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
...Read MoreFollow all the updates here:
Nov 14, 2025, 05:44:43 IST
బీహార్ ఫలితాలు 2025: ఎగ్జిట్ పోల్స్ విజేత ఎన్డీయే
రెండో విడత పూర్తయ్యాక ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒక సంస్థ మినహా అన్ని సర్వే సంస్థలు ఎన్డీయేకు సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టాయి. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయానికి చాలా దూరంలో ఉండిపోనుందని తేల్చాయి. అయితే పలు సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
Nov 14, 2025, 05:42:38 IST
బీహార్ ఫలితాలు 2025: మరికాసేపట్లో కౌంటింగ్ షురూ
రెండు విడతల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్దిగంటల్లో వెలువడనున్నాయి. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎప్పటికప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మీ ముందుంచనుంది.

E-Paper

