2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి గాను తొలి విడతలో 27 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో పలువురు ప్రముఖులకు చోటు కల్పించడం విశేషం.

తెలంగాణ మాజీ గవర్నర్, సీనియర్ నేత తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన మైలాపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ 'అవినాశి (SC)' స్థానం నుండి పోటీ చేయనున్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కోయంబత్తూర్ (నార్త్) నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
బీజేపీ అభ్యర్థుల జాబితా
(క్రమ సంఖ్య- నియోజకవర్గం, -అభ్యర్థి పేరు)
- ఆవడి - ఎం. రాజసింహ మహేంద్ర (ఎం. అశ్విన్‌కుమార్)
2. మైలాపూర్ - తమిళసై సౌందరరాజన్
3. తళ్ళి - నగేష్ కుమార్
4. తిరువణ్ణామలై - సి. ఎలుమలై
5. రాసీపురం (SC) - ఎస్.డి ప్రేమ్‌కుమార్
6. మొడక్కురిచ్చి - కీర్తిక శివకుమార్
7. ఉదగమండలం - భోజరాజన్
8. అవినాశి (SC) - ఎల్. మురుగన్
9. తిరుప్పూర్ (సౌత్) - ఎస్. తంగరాజ్
10. కోయంబత్తూర్ (నార్త్) - వానతీ శ్రీనివాసన్
11. తిరువారూర్ - గోవి చందు
12. తంజావూర్ - మురుగానందం
13. గంధర్వకోట్టై (SC) - సి. ఉదయకుమార్
{{/usCountry}}13. గంధర్వకోట్టై (SC) - సి. ఉదయకుమార్
{{/usCountry}}14. పుదుక్కోట్టై - ఎన్. రామచంద్రన్
15. అరంతంగి - కవితా శ్రీకాంత్
16. తిరుప్పత్తూర్ - కేసీ తిరుమారన్
17. మానామదురై (SC) - పొన్. వి. బాలగణపతి
18. మదురై సౌత్ - రామ శ్రీనివాసన్
19. సాత్తూర్ - నైనార్ నాగేంద్రన్
20. రామనాథపురం - జీబీఎస్ కే. నాగేంద్రన్
21. తిరుచెందూర్ - కేఆర్‌ఎం రాధాకృష్ణన్
22. వాసుదేవనల్లూర్ (SC) - అనంతన్ అయ్యసామి
23. రాధాపురం - ఎస్పీ బాలకృష్ణన్
24. నాగర్‌కోయిల్ - ఎం.ఆర్ గాంధీ
25. కొలచల్ - టి. శివకుమార్
26. పద్మనాభపురం - పి. రమేష్
27. విలవంకోడ్ - ఎస్. విజయధరణి
సర్వేలు ఏం చెబుతున్నాయి?
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఓపీనియన్ పోల్స్ భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.
- డీఎంకే ఆధిక్యం: 'పోల్ ట్రాకర్' సర్వే ప్రకారం అధికార ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) కూటమి మళ్లీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమికి 172 నుండి 178 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) 46 నుండి 52 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది.
- ఎన్‌డీఏ గెలుపు అంచనా: అయితే, మరో ప్రముఖ సర్వే మాత్రం దీనికి పూర్తి భిన్నమైన ఫలితాలను ఇచ్చింది. తమిళనాడులో ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని, వారికి 114 నుండి 127 స్థానాలు రావచ్చని పేర్కొంది. తమిళనాడులో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 104 నుండి 114 స్థానాల వద్దే ఆగిపోనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: తమిళసై సౌందరరాజన్ ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు?
సమాధానం: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ప్రశ్న 2: తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి? మెజారిటీ మార్కు ఎంత?
సమాధానం: తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏదైనా పార్టీ లేదా కూటమికి కనీసం 118 స్థానాలు అవసరం.
ప్రశ్న 3: తమిళనాడు ఎన్నికల పోలింగ్ మరియు ఫలితాల తేదీలు ఏమిటి?
సమాధానం: తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేసి మే 4న ఫలితాలు ప్రకటిస్తారు.