ముంబయి: మొదటి వివాహం విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడనే కారణంతో గర్భవిచ్ఛిత్తికి (అబార్షన్) అనుమతి ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. పుణేకు చెందిన 33 ఏళ్ల వివాహిత దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. వైద్య గర్భవిచ్ఛిత్తి చట్టం (ఎమ్టీపీ) 1971, ఎమ్టీపీ నిబంధనలు 2003 ప్రకారం 24 వారాల కంటే ఎక్కువ ఉన్న గర్భాన్ని తొలగించడానికి నిర్దేశించిన ఏ కేటగిరీ పరిధిలోకి ఈ కేసు రాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
భర్త మోసం చేశాడంటూ కోర్టుకు..

బాధితురాలి కథనం ప్రకారం.. 2025 ఫిబ్రవరి 16న ఆమెకు వివాహమైంది. అయితే, భర్తకు ఇదివరకే పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడని కొన్ని పత్రాల ద్వారా ఆమె తెలుసుకుంది. భర్త వేధింపులు తాళలేక అత్తవారింటి నుంచి బయటకు వచ్చిన ఆమె, ఆ తర్వాత జులై 26న తాను 13 వారాల గర్భవతినని గుర్తించింది. భర్త చేసిన మోసం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, దాంతో తన సంతానోత్పత్తి హక్కుల్లో భాగంగా గర్భాన్ని తీసివేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించింది.
కేసు విచారణకు వచ్చేసరికి గర్భం వ్యవధి 24 వారాలు దాటిపోవడంతో, ఆమె తరఫు న్యాయవాది వైద్య బోర్డుకు కేసును నివేదించి అబార్షన్కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
చట్టపరిధి దాటి ఊరట ఇవ్వలేం
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ భారతీ డాంగ్రే, జస్టిస్ ఆశిష్ చవాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "పిటిషనర్ ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితి పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ, ఎమ్టీపీ చట్టంలోని నిబంధనలను దాటి న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎమ్టీపీ నిబంధనలు 2003 ప్రకారం.. 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేయడానికి మైనర్లు, లైంగిక దాడి బాధితులు, గర్భధారణ సమయంలో విడాకులు పొందినవారు లేదా భర్తను కోల్పోయిన మహిళలు, వికలాంగులు, మానసిక వికలాంగులు, పిండంలో తీవ్ర లోపాలు ఉన్న కేసుల వంటి ఏడు ప్రత్యేక కేటగిరీల మహిళలకు మాత్రమే అనుమతి ఉందనే విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. భర్త మోసం చేశాడనే ఆరోపణలు ఏ కేటగిరీ కిందకూ రావని స్పష్టం చేసింది.
ఆరోపణలపై న్యాయపరమైన నిర్ధారణ లేదు
భర్త మోసం చేశాడనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ (Judicial finding) లేదని, అవి కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. చట్టం నిర్దేశించిన చట్రానికి లోబడి మాత్రమే కోర్టులు తీర్పునివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.
{{/usCountry}}భర్త మోసం చేశాడనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ (Judicial finding) లేదని, అవి కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. చట్టం నిర్దేశించిన చట్రానికి లోబడి మాత్రమే కోర్టులు తీర్పునివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.
{{/usCountry}}