BRO Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్! ముగియనున్న బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ గడువు..
BRO Recruitment 2026 apply online : బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో 899 ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువును 2026 జులై 4 వరకు పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) రిక్రూట్‌మెంట్ 2026పై అప్డేట్. హిందీ టైపిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్ వంటి పలు విభాగాల్లో మొత్తం 899 పోస్టుల భర్తీకి జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ.. జులై 4న ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ bro.gov.in ద్వారా నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం 899 పోస్టుల భర్తీకి గానూ నోటిఫికేషన్ విడుదలవగా.. విభాగాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి:
స్టోర్ కీపర్ టెక్నికల్: 300 పోస్టులు
ఆపరేటర్ కమ్యూనికేషన్: 261 పోస్టులు
ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ: 207 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 79 పోస్టులు
డ్రాఫ్ట్స్‌మ్యాన్: 42 పోస్టులు
హిందీ టైపిస్ట్: 10 పోస్టులు
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు, వయోపరిమితి..
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026లో భాగమైన ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు ఒక్కో విభాగానికి ఒక్కో విధంగా ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, సంబంధిత డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు అర్హులు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్‌ను చూడాలని అధికారులు స్పష్టం చేశారు.
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
బీఆర్‌ఓలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్‌లు కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.
"ఈ పరీక్షల్లో సాధించిన మార్కులను ఫైనల్ సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోరు," అని బోర్డు స్పష్టం చేసింది.
రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అయితే, ఫైనల్ సెలక్షన్ కావడానికి ఈ పీఈటీ, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టులలో పాస్ అవ్వడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి.
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము..
జనరల్, ఈడబ్ల్యూఎస్ (మాజీ సైనికోద్యోగులు, మాజీ అగ్నివీరులతో కలిపి), ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 50/- గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు, వీరికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తును ఎక్కడికి పంపాలి?
ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పోస్టల్ సర్వీస్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌పై అడ్వర్టైజ్‌మెంట్ నంబర్, తేదీ, తాము అప్లై చేస్తున్న పోస్టు/ట్రేడ్ పేరును స్పష్టంగా రాయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది:
చిరునామా: Commandant, GREF Centre, Dighi Camp, Pune - 411015
గడువు ముగియడానికి ఎంతో సమయం లేదు కాబట్టి, పోస్టల్ ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
బీఆర్ఓ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


