రోజుకు 2.5జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాల్స్​- బీఎస్​ఎన్​ఎల్​ నుంచి మరో చౌకైన ప్లాన్​..

బీఎస్‌ఎన్ఎల్ 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్ విడుదలైంది. రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఆఫర్​ ధర, ఇతర వివరాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 15, 2025, 11:32:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్​).. తన ప్రీపెయిడ్ కస్టమర్‌ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్​ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

బీఎస్‌ఎన్ఎల్ 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్..
బీఎస్‌ఎన్ఎల్ 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్..

బీఎస్‌ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్ వివరాలు..

ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే కస్టమర్లకు రోజుకు 2.5జీబీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్​ఎంఎస్​ ప్రయోజనాలను అందిస్తుంది. గతంలో ప్రకటించిన సిల్వర్ జూబ్లీ ఎఫ్​టీటీహెచ్​ ప్లాన్‌కు అదనంగా ఈ ఆఫర్ ఇప్పుడు చేరింది.

బీఎస్‌ఎన్ఎల్ అందించిన వివరాల ప్రకారం, ఈ సిల్వర్ జూబ్లీ ప్లాన్ ధర రూ. 225. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఈ కాలంలో, కస్టమర్‌లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు:

రోజువారీ డేటా: రోజుకు 2.5జీబీ 4జీ డేటా

వాయిస్ కాల్స్: అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్​టీడీ వాయిస్ కాల్స్

ఎస్​ఎంఎస్​ ప్రయోజనాలు: రోజుకు 100

ఎఫ్​యూపీ పరిమితి: ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం, రోజువారీ కేటాయింపు కోటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్​కి తగ్గిపోతుంది.

బీఎస్​ఎన్​ఎల్​ సిల్వర్​ జూబ్లీ ప్లాన్​- ఆఫర్ ఎలా పొందాలి?

ఈ ఆఫర్‌ను పొందడానికి:

ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు: బీఎస్‌ఎన్ఎల్ వెబ్ పోర్టల్ లేదా బీఎస్‌ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

కొత్త కస్టమర్‌లు: రిటైలర్లను లేదా బీఎస్‌ఎన్ఎల్ కామన్ సర్వీసెస్ సెంటర్లను సంప్రదించవచ్చు. ఈ సర్వీస్ సెంటర్లు సిమ్ కార్డు జారీ, బిల్ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు వంటి ప్రభుత్వ వినియోగ, ఇతర సేవలను అందించే యాక్సెస్ పాయింట్లుగా పనిచేస్తాయి.

బీఎస్​ఎన్​ఎల్​ సిల్వర్ జూబ్లీ ఎఫ్​టీటీహెచ్​ ప్లాన్ (ఫైబర్)..

బీఎస్‌ఎన్ఎల్ ఇటీవల సిల్వర్ జూబ్లీ ఎఫ్​టీాటీహెచ్​ (ఫైబర్​ టు హోమ్​) ప్లాన్‌ను కూడా ప్రకటించింది.

ధర: నెలకు రూ. 625.

ప్రయోజనాలు: ఇది 70ఎంబీపీఎస్​ వేగంతో 2500జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

వినోదం: కస్టమర్‌లు 127 ప్రీమియం ఛానెల్‌లు సహా 600కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: ఇందులో జియోహాట్‌స్టార్, సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభంలో కోల్పోయిన చందాదారుల సంఖ్యను తిరిగి పొందడం కోసం.. బీఎస్‌ఎన్ఎల్ ఇటీవలి నెలల్లో అనేక ప్రత్యేక ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) విడుదల చేసిన టెలికాం సబ్‌స్క్రిప్షన్ డేటా ప్రకారం, ఏప్రిల్‌లో ఈ సంస్థ మొత్తం 0.2 మిలియన్ల చందాదారులను కోల్పోయింది. అదే సమయంలో, యాక్టివ్ బీఎస్‌ఎన్ఎల్ చందాదారులు 1.8 మిలియన్ల మేర తగ్గారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More