శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 297 పాయింట్లు పడి 82,270 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 98 పాయింట్లు కోల్పోయి 25,320 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 347 పాయింట్లు పడి 59,610 వద్దకు చేరింది.

సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు. కానీ బడ్జెట్ 2026 నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఉదయం 9 నుంచి 9:08 వరకు ప్రీ-మార్కెట్ సెషన్ ఉంటుంది. అనంతరం 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,251.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 601.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 41,435.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,220.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
బడ్జెట్ 2026: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
బడ్జెట్ 2026 నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని, ట్రేడర్ల్- ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
“శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో మైనర్ అప్పర్ షాడోతూ కూడిన గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. కీలక రెసిస్టెన్స్ వద్ద ఇది కన్సాలిడేషన్ మూమెంట్‌ని సుచిస్తోంది. అయితే, మార్కెట్లు ప్రస్తుతం బడ్జెట్ 2026 కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఈవెంట్ తర్వాత సూచీ ఎటైనా కదలవచ్చు. నిఫ్టీ50కి 25,200 వద్ద సపోర్ట్ ఉంది. 25,450- 25,500 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
బడ్జెట్ 2026 స్టాక్స్ టు బై..
{{/usCountry}}అమెరికా స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
బడ్జెట్ 2026 స్టాక్స్ టు బై..
{{/usCountry}}నెస్లే ఇండియా- బై రూ. 1332, స్టాప్ లాస్ రూ. 1285, టార్గెట్ రూ. 1426
జీఈఎస్హెచ్ఐపీ- బై రూ. 1202, స్టాప్ లాస్ రూ. 1160, టార్గెట్ రూ. 1286
బీఈఎల్- బై రూ. 449, స్టాప్ లాస్ రూ. 442, టార్గెట్ రూ. 462
దీపక్ ఫర్టిలైజర్స్- బై రూ. 1055, స్టాప్ లాస్ రూ. 1020, టార్గెట్ రూ. 1100
పేటీఎం- బై రూ. 1037, స్టాప్ లాస్ రూ. 1010, టార్గెట్ రూ. 1100
కమిన్స్ ఇండియా- బై రూ. 4112, స్టాప్ లాస్ రూ. 4020, టార్గెట్ రూ. 4300
రైల్‌టెల్- బై రూ. 353.4, స్టాప్ లాస్ రూ. 345, టార్గెట్ రూ. 375
సెమ్‌ఇండియా ప్రాజెక్ట్స్- బై రూ. 639.4, స్టాప్ లాస్ రూ. 625, టార్గెట్ రూ. 677