Family car : 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ- నిస్సాన్ గ్రావైట్ యాక్ససరీస్‌తో మరింత కంఫర్ట్!
Nissan Gravite : భారతీయ రోడ్లపై ఫ్యామిలీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నిస్సాన్ సంస్థ తన ఎంపీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ 'నిస్సాన్ గ్రావైట్'ను ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు ఈ ఎంపీవిని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ యాక్ససరీస్ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది.
నిస్సాన్ తన యూటిలిటీ వాహనాల శ్రేణిని బలోపేతం చేసే దిశగా 'గ్రావైట్'ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉన్నప్పటికీ, నిస్సాన్ దీనికి కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి మరింత అప్‌మార్కెట్ లుక్‌ను అందించింది. బడ్జెట్ ధరలో 7 సీటర్ ఫ్యామిలీ కారు కోరుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. మీరు ఒకవేళ

నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- ఇంజిన్, పనితీరు..
నిస్సాన్ గ్రావైట్ సబ్-ఫోర్ మీటర్ ఎంపీవీ విభాగంలో వస్తుంది. ఇది ట్రైబర్‌లో ఉపయోగించిన అదే సీఎంఎఫ్-ఏ+ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి రూపొందింది.
ఇంజిన్: 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.
పవర్: 71 బీహెచ్పీ గరిష్ట పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్: ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
సిటీ డ్రైవింగ్‌కి, చిన్నపాటి ప్రయాణాలకు ఈ ఇంజిన్ చక్కగా సరిపోతుంది.
గ్రావైట్ కోసం జెన్యూన్ యాక్సెసరీస్..
కొత్త కారు కొనేటప్పుడు దానిని మనకు నచ్చినట్లుగా అలంకరించుకోవడం సహజం. నిస్సాన్ గ్రావైట్ కోసం కంపెనీ ప్రత్యేకంగా 'జెన్యూన్ యాక్సెసరీస్'ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని నిస్సాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా నేరుగా షోరూమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.
| నిస్సాన్ గ్రావైట్ యాక్ససరీస్.. | |||||
|---|---|---|---|---|---|
| ఎక్స్టీరియర్ | ధర (రూ.) | ఇంటీరియర్ | ధర (రూ.) | ఎలక్ట్రానిక్స్ | ధర (రూ.) |
| క్రోమ్ విండో ఫ్రేమ్ కిట్ | 2,199 | వెంటిలేషన్‌తో కూడిన మసాజర్ సీట్ కవర్ | 5,499 | ఫుట్‌వెల్ యాంబియెంట మూడ్లైట్ | 2,599 |
| క్రోమ్ డోర్ హ్యాండిల్స్ | 1,499 | ఫర్ఫోరేటెడ్ స్టీరింగ్ వీల్ కవర్ | 599 | డ్యూయెల్ డ్యాష్‌క్యామ్ | 9,999 |
| క్రోమ్ విండ్ డిఫ్లెక్టర్ | 2,699 | మాగ్నెటిక్ సన్‌షేడ్స్ | 1,499 - 3,359 | 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ | ఎన్ఏ |
| 14 ఇంచ్ వీల్ కవర్ ప్యాక్ | 3,899 | పీవీసీ ఫ్లోర్ మ్యాట్ | 1,999 | ఎయిర్ ప్యూరిఫయర్ | 4,599 |
| స్ప్లాష్ గార్డ్ కిట్ | 799 | కార్పెట్ ఫ్లోర్ మ్యాట్ | 2,399 | జేబీఎల్ స్పీకర్స్ | 9,999 |
| బాడీసైడ్ గ్రాఫిక్ కిట్ | 5,499 | డ్యూయెల్ లేయర్ 7డీ ఫ్లోర్ మ్యాట్ | 6,999 | వైర్లెస్ ఛార్జర్ | 5,499 |
| రూఫ్ కారియర్ | 9,999 | సీట్ కవర్ | 7,999 | టైర్ పంచర్ రిపేర్ కిట్ | 2,899 |
| బాడీ కవర్ | 1,849 | నెక్ అండ్ లుంబర్ కుషన్ | 1,499- 1,999 | పుడిల్ ల్యాంప్ | 5,499 |
| డోర్ ఎడ్జ్ గార్డ్ | 368 | పీవీసీ ట్రంక్ మ్యాట్ | 1,099 | వాక్యూమ్ క్లీనర్ | 2,499 |
నిస్సాన్ గ్రావైట్- యాక్సెసరీల రకాలు..
విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్స్: కారు బయట క్రోమ్ ఫినిషింగ్, రూఫ్ రైల్స్, ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ వంటివి కారు లుక్‌ను మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.
కంఫర్ట్, కన్వీనియెన్స్: సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, యాంబియంట్ లైటింగ్, ఆర్మ్‌రెస్ట్‌లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.
ఫంక్షనాలిటీ: మడ్ ఫ్లాప్స్, బాడీ కవర్లు, వెదర్ గార్డ్స్ వంటివి కారును సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి.
తమ అభిరుచికి అనుగుణంగా కస్టమర్లు వివిధ రకాల ప్యాకేజీలను ఎంచుకునే వెసులుబాటును నిస్సాన్ కల్పిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


