Nissan Gravite : నిస్సాన్ గ్రావైట్ బుక్ చేశారా? 7 సీటర్ బడ్జెట్ ఎంపీవీపై బిగ్ అప్డేట్..
Nissan Gravite MPV Deliveries : నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీని బుక్ చేసిన వారికి బిగ్ అప్డేట్! ఈ 7 సీటర్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎంపీవీ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కారు ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి నిస్సాన్ సంస్థ తన సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'ని ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రారంభ ధరను రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించారు. నాలుగు మీటర్ల లోపు పొడవుతో రూపొందిన ఈ మోడల్, ప్రాథమికంగా రెనాల్ట్ ట్రైబర్‌కు 'రీబ్యాడ్జ్' వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్‌షిప్‌లకు ఈ కార్లు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మోడల్‌పై బిగ్ అప్డేట్ లభించింది. ఈ 7 సీటర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపీవీ డెలివరీలను సంస్థ ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో సరికొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ అండ్ డిజైన్..
నిస్సాన్ తనదైన ప్రత్యేక గుర్తింపును చాటుకునేలా ఈ గ్రావైట్ ఎంపీవీని రూపొందింది. దీని ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ 'వి-మోషన్' గ్రిల్ ఉంది. దీనికి ఇరువైపులా డే-టైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్లిమ్ హెడ్‌ల్యాంప్స్ అమర్చారు. బోనెట్‌పై 'Gravite' అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తుండగా, బంపర్‌పై సిల్వర్ డీటెయిలింగ్, స్కల్ప్టెడ్ హుడ్ ఎలిమెంట్, రగ్గడ్ లుక్ ఇచ్చే ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఆకట్టుకుంటున్నాయి.
కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్తగా డిజైన్ చేసిన 15- ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానించిన షార్ప్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటి మధ్యలో నిస్సాన్ లోగో, ల్యాంప్ క్లస్టర్‌లో 'గ్రావైట్' బ్రాండింగ్‌ను చేర్చారు. వెనుక బంపర్‌పై కూడా సిల్వర్ యాక్సెంట్స్ ఇచ్చారు. వినియోగదారులు ఫారెస్ట్ గ్రీన్, ఆనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, మెటాలిక్ గ్రే, స్టార్మ్ వైట్ అనే ఐదు రంగుల్లో ఈ కారును ఎంచుకోవచ్చు.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- క్యాబిన్ సౌకర్యాలు అండ్ ఫీచర్లు..
ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యతనిస్తూ గ్రావైట్ లోపల 7-సీటర్ లేఅవుట్‌ను అందించారు. క్యాబిన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్-టోన్ థీమ్‌తో ఉంటుంది. సీట్లపై ఉన్న స్వెడ్ ఇన్సర్ట్స్, ప్రత్యేకమైన స్టిచింగ్ ప్యాటర్న్స్ ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి. 7- ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ముందు భాగంలో రీడిజైన్ చేసిన స్టీరింగ్ వీల్ ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేసే 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ప్రత్యర్థి కార్లతో పోలిస్తే దీని ఇంటీరియర్ లేఅవుట్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- ఇంజిన్, పనితీరు..
7 సీటర్ బడ్జెట్ ఫ్రెండ్లీ నిస్సాన్ గ్రావైట్‌లో 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 71 హెచ్‌పీ పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్‌తో పంచుకున్న ఇంజిన్ అయినప్పటికీ, నిస్సాన్ తనదైన శైలికి అనుగుణంగా దీనిని ట్యూన్ చేసింది.
ట్రాన్స్‌మిషన్: ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మైలేజ్: మాన్యువల్ వెర్షన్ లీటరుకు 19.3 కి.మీ, ఏఎంటీ వెర్షన్ 19.6 కి.మీ మైలేజీని ఇస్తుందని నిస్సాన్ పేర్కొంది.
తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం త్వరలోనే ఇందులో సీఎన్జీ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్ ధృవీకరించింది.
మరి మీరు మీ నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీని బుక్ చేశారా?
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న- నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ మైలేజ్ ఎంత?
సమాధానం- ఈ నిస్సాన్ గ్రావైట్‌లో 1.0లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తుంది. దీనిని మేన్యువల్ గేర్‌బాక్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు 19.3 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుందని, అదే ఏఎంటీకి కనెక్ట్ చేసినప్పుడు 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
ప్రశ్న- నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ సేఫ్టీ ఫీచర్స్ ఎంటి?
సమాధానం- ఈ 7 సీటర్, అఫార్డిబుల్ ఎంపీవీలో 45 యాక్టివ్- పాసివ్ సఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. పైగా అన్ని వేరియంట్లలో 30కిపైగా ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, యాంటీ- లాక్ బ్రేకింగ్ సిస్టెమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


