Nissan Gravite : రూ. 5.6 లక్షలకే నిస్సాన్ గ్రావైట్ బేస్ వేరియంట్- 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ ఫీచర్లు..
7 సీటర్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఎంపీవీ అయిన నిస్సాన్ గ్రావైట్‌ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ గ్రావైట్ బేస్ వేరియంట్ ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
నిస్సాన్ కంపెనీ తన సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'తో బడ్జెట్ ధరలో గరిష్ట ప్రయోజనాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఎక్స్‌షోరూమ్ వద్ద రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న దీని బేస్ వేరియంట్, తక్కువ బడ్జెట్‌లో ఒక నికార్సైన 7-సీటర్ కారును కోరుకునే వారిని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నిస్సాన గ్రావైట్ బేస్ వేరియంట్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- ఎక్స్‌టీరియర్..
బేస్ వేరియంట్ అయినప్పటికీ, గ్రావైట్ డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. నిస్సాన్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, మజిల్ లైన్స్‌తో కూడిన బోనెట్ దీనికి ఎస్‌యూవీ తరహా గంభీరమైన రూపాన్ని ఇచ్చాయి.
హెడ్‌ల్యాంప్స్: ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
వీల్స్: ఖర్చు తగ్గించేందుకు ఇందులో స్టీల్ వీల్స్‌ను అందించారు, అయితే వాటిపై వీల్ కవర్లు ఉండటం వల్ల చూడటానికి బాగుంటాయి.
బాడీ క్లాడింగ్: వీల్ ఆర్చెస్, బాడీ చుట్టూ ఉన్న బ్లాక్ క్లాడింగ్ దీనికి రగ్గడ్ అప్పీల్‌ను ఇస్తుంది. బంపర్లు మాత్రం బాడీ కలర్‌లోనే వస్తాయి.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- క్యాబిన్ అండ్ కంఫర్ట్..
7 సీటర్ నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ లోపల క్యాబిన్ అంతా బ్లాక్ థీమ్‌తో ఫ్యాబ్రిక్ అప్హోలిస్ట్రీని కలిగి ఉంటుంది. డాష్‌బోర్డ్ డిజైన్ ఖరీదైన వేరియంట్ల తరహాలోనే డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ: రెండో వరుస సీట్లను స్లైడ్, రెక్లైన్ చేసుకోవచ్చు. మూడో వరుసలోకి వెళ్లడానికి వీలుగా రెండో వరుసలో 60:40 స్ల్పిట్, ఫోల్డ్ అండ్ టంబుల్ ఫంక్షన్లను ఇచ్చారు.
బూట్ స్పేస్: అవసరమైతే మూడో వరుస సీట్లను పూర్తిగా తొలగించి బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.
విండోస్: ముందు వైపు పవర్ విండోస్ ఉండగా, వెనుక ప్రయాణికులు మాన్యువల్ విండోస్ వాడాల్సి ఉంటుంది. ఓఆర్వీఎం కూడా మాన్యువల్‌గానే అడ్జస్ట్ చేసుకోవాలి.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- మిస్ అవుతున్న ఫీచర్లు..
బేస్ వేరియంట్ కావడం వల్ల ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లు ఉండవు. ముఖ్యంగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ లేదు. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు కూడా ఉండవు. ఇందులో మాన్యువల్ ఏసీ ఉంటుంది కానీ వెనుక వైపు ఏసీ వెంట్స్ లేవు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చిన్న 3.5 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- భద్రత..
నిస్సాన్ సంస్థ గ్రావైట్ విషయంలో భద్రతకు పెద్దపీట వేసింది. బేస్ వేరియంట్లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించడం విశేషం. వీటితో పాటు:
ఏబీఎస్ విత్ ఈబీడీ
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
హిల్ స్టార్ట్ అసిస్ట్
రియర్ పార్కింగ్ సెన్సార్స్
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)
ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే రెయిన్ సెన్సింగ్ వైపర్లు, రియర్ కెమెరా, రియర్ వైపర్ వంటివి ఇందులో ఉండవు.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
గ్రావైట్ బేస్ వేరియంట్‌లో 72 పీఎస్ గరిష్ట పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ ఎంపీవీని పూర్తిగా సిటీ డ్రైవింగ్, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి రూపొందించారు. ఇందులో ఏఎంటీ ఆప్షన్ లేదు.
మొత్తానికి, తక్కువ ధరలో మంచి లుక్, కావాల్సినంత స్పేస్, ప్రాథమిక వెసులుబాట్లు, మంచి భద్రతా ఫీచర్లు కోరుకునే వారికి నిస్సాన్ గ్రావైట్ బేస్ వేరియంట్ ఒక మెరుగైన ఆప్షన్ అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. గ్రావైట్ ఎంపీవీలో ఎన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి?
భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నిస్సాన్ తన గ్రావైట్ మోడల్‌లోని అన్ని వేరియంట్లలో (బేస్ వేరియంట్ సహా) 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం అనేది ప్రయాణికుల భద్రత పరంగా ఒక గొప్ప విషయమని చెప్పవచ్చు.
2. నిస్సాన్ గ్రావైట్‌లో మూడో వరుస సీట్లను తొలగించవచ్చా?
అవును, ఈ కారులోని ప్రధాన సౌకర్యాలలో ఇదీ ఒకటి. గ్రావైట్ మూడో వరుస సీట్లను అవసరమైనప్పుడు పూర్తిగా తొలగించవచ్చు. దీనివల్ల కారులో ఎక్కువ లగేజీ పడుతుంది. ప్రయాణికుల సంఖ్య, సామాను అవసరాలకు అనుగుణంగా క్యాబిన్ లోపల సీట్లను మార్చుకునే సౌలభ్యం ఇందులో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


