Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ బేస్​ వేరియంట్​- సామాన్యుడి ఎలక్ట్రిక్ కల ఇక నిజం!

Tata Punch EV facelift base variant : టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్​యూవీ 'పంచ్ ఈవీ'ని కొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అప్‌డేట్ చేసింది. బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా దీని ‘స్మార్ట్’ బేస్ వేరియంట్‌ను అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చింది. ఈ బేస్​ వేరియంట్​ వివరాలు మీకోసం..

Published on: Feb 26, 2026 6:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్.. తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్​యూవీ 'పంచ్ ఈవీ'ని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇటీవలే ప్రవేశపెట్టింది. సాధారణంగా బేస్ వేరియంట్ అంటే కేవలం మొక్కుబడి ఫీచర్లు ఉంటాయని చాలామంది భావిస్తున్న ఈ కాలంలో ఈ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ 'స్మార్ట్' వేరియంట్ మాత్రం అందుకు భిన్నం! తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఆశించే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ బేస్​ వేరియంట్​ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..
టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..

2026 టాటా పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​- పవర్‌ట్రెయిన్, డ్రైవ్ మోడ్స్

ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సెటప్‌ను చాలా సమర్థవంతంగా డిజైన్ చేశారు. ఇందులో 'మల్టీ-మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్' సిస్టమ్ ఉంది. దీనివల్ల కారు వేగం తగ్గుతున్నప్పుడు ఆ శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపడం ద్వారా రేంజ్‌ను పెంచుకోవచ్చు. దీనిపై డ్రైవర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. అలాగే, సిటీ ట్రాఫిక్‌లో సాఫీగా సాగిపోయేందుకు 'సిటీ' మోడ్, వేగంగా దూసుకెళ్లాలనుకునే వారి కోసం 'స్పోర్ట్' మోడ్ అనే రెండు డ్రైవ్ మోడ్లను టాటా అందించింది.

2026 టాటా పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​- టెక్నాలజీలో టాప్!

ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బేస్​ వేరియంట్​ ఎంట్రీ లెవల్ మోడల్ అయినప్పటికీ, టెక్నాలజీ పరంగా టాటా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 50కి పైగా ఫీచర్లతో కూడిన 'ఐఆర్​ఏ' కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, రిమోట్ వెహికల్ మానిటరింగ్ వంటి సదుపాయాలు పొందవచ్చు.

10.16 సెం.మీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది.

'స్మార్ట్ డిజిటల్ డీఆర్​ఎల్స్​' కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

హై బీమ్ అలర్ట్ వంటి ఫీచర్లు రాత్రి వేళ ప్రయాణాల్లో సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి.

2026 టాటా పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​- సౌకర్యం, ఫీచర్లు..

రోజువారీ ప్రయాణాల్లో సౌకర్యం కోసం ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (i FATC) ఇచ్చారు. అలాగే ఫ్రంట్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే వెలుపలి మిర్రర్లు (ఓఆర్​వీఎంలు), హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక ప్రయాణించే వారి కోసం అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి సదుపాయాలు ఈ బేస్ వేరియంట్‌ను మరింత విలువైనదిగా మార్చాయి.

2026 పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​ హైలైట్స్​..
2026 పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​ హైలైట్స్​..

2026 టాటా పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​- భద్రతలో రాజీ లేదు..

టాటా కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఇక 2026 పంచ్ ఈవీ బేస్ వేరియంట్‌లో కూడా భద్రతకు పెద్దపీట వేశారు.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు: ప్రయాణికుల రక్షణ కోసం ప్రామాణికంగా ఇచ్చారు.

కంట్రోల్ సిస్టమ్స్: ఈఎస్​పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏబీఎస్​తో కూడిన ఈబీడీ, హిల్‌ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.

అదనపు ఫీచర్లు: టైర్ ప్రెజర్ మానిటరింగ్ (ఐటీపీఎంఎస్​), పిల్లల భద్రత కోసం ISOFIX సీట్ యాంకర్లు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అయ్యేలా 'ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్' ఫీచర్ కూడా ఇందులో ఉంది.

2026 టాటా పంచ్​ ఈవీ బేస్​ వేరియంట్​- ధర, రేంజ్​..

టాటా పంచ్​ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​లోని స్మార్ట్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.69 లక్షలుగా ఉంది. దీని రేంజ్​ దాదాపు 270 కి.మీ వరకు ఉంటుంది. బీఏఏఎస్​ (బ్యాటరీ యాజ్​ ఏ సర్వీస్​) స్కీమ్​ కూడా ఇస్తోంది టాటా మోటార్స్​. ఫలితంగా దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.49లక్షల వద్ద ప్రారంభమవుతుంది. అదనంగా, కి.మీకి రూ. 2.6 బ్యాటరీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. (ఇవి ఇంట్రొడొక్టరీ ప్రైజ్​లు అని గుర్తుపెట్టుకోవాలి.)

తక్కువ ధరలో ఒక పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్ ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న- టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయా?

సమాధానం- 2026 పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది టాటా మోటార్స్. కస్టమర్లు తమ సమీపంలోని టాటా మోటార్స్​ డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

ప్రశ్న- టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత? బేస్ వేరియంట్ కొనడం లాభమేనా?

కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధరలు ఎక్స్‌-షోరూమ్ వద్ద రూ. 9.69 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అయితే టాటా ప్రవేశపెట్టిన బీఏఏఎస్​ ప్లాన్ తీసుకుంటే, దీని ప్రారంభ ధర కేవలం రూ. 6.49 లక్షలకే లభిస్తుంది (బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున అదనంగా చెల్లించాలి). బడ్జెట్ తక్కువగా ఉండి, సేఫ్టీ (6 ఎయిర్‌బ్యాగ్స్), కనెక్టెడ్ కార్ ఫీచర్లు కోరుకునే వారికి దీని 'స్మార్ట్' బేస్ వేరియంట్ ఒక అద్భుతమైన ఎంపిక.