Maruti Suzuki e Vitara : 440 కి.మీ రేంజ్​తో​ ఈ విటారా బేస్​ వేరియంట్​- ఫీచర్స్​, ధర వివరాలు..

మారుతీ సుజుకీ ఈ విటారా కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బేస్​ వేరియంట్​ రేంజ్​, ఫీచర్స్​, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 24, 2026, 11:20:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ, తన 'ఈ విటారా'తో మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. చాలామంది కొనుగోలుదారులకు ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ (బేస్) వేరియంట్ “డెల్టా” అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. అవసరమైన ఫీచర్లను అందిస్తూనే ధరను నియంత్రణలో ఉంచడంపై ఈ వేరియంట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ మారుతీ సుజుకీ ఈ విటారా బేస్ వేరియంట్​లో లభించే ఫీచర్స్​ ఏంటి? ఏ ఫీచర్స్​ ఉండవు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాము.

మారుతీ సుజుకీ ఈ విటారా
మారుతీ సుజుకీ ఈ విటారా

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్​- ధర..

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 15.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్) గా నిర్ణయించారు. ఇది చిన్నదైన 49 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ లైనప్‌లో తక్కువ ధరలో లభించే మోడల్ ఇదే అయినప్పటికీ, దీని కోర్ మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి రాజీ పడలేదు.

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్​- రేంజ్​..

ఇందులోని బ్యాటరీ ప్యాక్​.. ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ముందు భాగంలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్‌ను అందిస్తుంది. ఈ సెటప్ సుమారు 141 బీహెచ్​పీ పవర్, 193 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఈ ఈవీ 440 కిలోమీటర్ల రేంజ్​ ఇస్తుందని మారుతీ సుజుకీ పేర్కొంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మిగిలిన వేరియంట్ల మాదిరిగానే, ఇది కూడా కేవలం ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లోనే లభిస్తుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్​..
మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్​..

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్- ఛార్జింగ్ వివరాలు..

ఇందులోని ఎల్​ఎఫ్​పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది:

డీసీ ఫాస్ట్ ఛార్జర్: 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి కేవలం 45 నిమిషాలు పడుతుంది.

7.4 కేడబ్ల్యూ ఛార్జర్: ఇంట్లో ఉండే ఈ ఛార్జర్‌తో 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 6.5 గంటల సమయం పడుతుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్- ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లు..

బయట చూడ్డానికి బేస్ వేరియంట్ కూడా టాప్ మోడల్స్ తరహాలోనే ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది. కానీ కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ ఇందులో కనిపించవు! ఇందులో ఎల్​ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉండవు. అలాగే, ఖరీదైన వేరియంట్లలో ఉండే డార్క్ ట్రీటెడ్ గ్లాస్ బదులు సాధారణ హీట్-అబ్సార్బింగ్ గ్లాస్‌ను వాడారు. కస్టమర్లు ఆరు రకాల ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్ లేఅవుట్ ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. బేస్ ట్రిమ్‌లో బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్ అప్​హోలిస్ట్రీ అందించారు. డ్యాష్‌బోర్డ్ డిజైన్‌లో మార్పు లేకపోయినప్పటికీ, టాప్ వేరియంట్లతో పోలిస్తే ఫీచర్ల జాబితా కొంత తక్కువగా ఉంటుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్ వేరియంట్‌లో లేని ఫీచర్లు..

అఫార్డిబుల్​ ధరలో ఉంచేందుకు మారుతీ సుజుకీ కొన్ని సౌకర్యాలను ఇందులో తొలగించింది. అవి..

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉండవు.

సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం లేదు.

ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఇందులో భాగం కాదు.

మారుతీ సుజుకీ ఈ విటారా బేస్​ వేరియంట్​- కొనొచ్చా?

ప్రీమియం లగ్జరీ ఫీచర్ల కంటే మైలేజ్ (రేంజ్), ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ బేస్ వేరియంట్ సరిగ్గా సరిపోతుంది. ఇది ఒక ఈవీకి ఉండాల్సిన ప్రాథమిక అవసరాలన్నింటినీ తీరుస్తుంది. కేవలం విలాసవంతమైన ఫీచర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో బీఏఏఎస్​ ఆప్షన్​ ఉందా?

సమాధానం- మారుతీ సుజుకీ ఈ విటారాలో బ్యాటరీ యాజ్​ ఏ సర్వీస్​ ఆప్షన్​ ఉంది. ఫలితంగా ఈ బేస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.99లక్షలకు దిగొస్తుంది. కాగా, అదనంగా ప్రతి కిలోమీటరుకు రూ. 3.99 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న- ఈ ఈ విటారా బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

సమాధానం- మారుతీ సుజుకీ ఈ విటారా వేగంగా ఛార్జ్ అయ్యే సాంకేతికతను కలిగి ఉంది. మీరు డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, కేవలం 45 నిమిషాల్లోనే బ్యాటరీని 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ఉండే 7.4 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, బ్యాటరీని 10% నుంచి 100% ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 6.5 గంటల నుంచి 9 గంటల సమయం పడుతుంది (బ్యాటరీ సైజును బట్టి).

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More