Tata Avinya EV : టాటా నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- అవిన్య ఈవీ లాంచ్​ ఎప్పుడంటే..

టాటా మోటార్స్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘అవిన్య’ను త్వరలో విడుదల చేయనుంది. జేఎల్ఆర్ సాంకేతికతతో రూపొందుతున్న ఈ ఎలక్ట్రిక్​ కారు, అత్యాధునిక ఫీచర్లు, వినూత్న డిజైన్‌తో హై-ఎండ్ ఈవీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Feb 23, 2026, 10:01:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్.. ఇప్పుడు లగ్జరీ ఈవీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తన ప్రతిష్టాత్మక 'అవిన్య' బ్రాండ్ కింద తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరిలోపు ఆవిష్కరించే/ లాంచ్​ చేసే అవకాశం ఉంది. 2025 దిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'అవిన్య ఎక్స్​' కాన్సెప్ట్ ఆధారంగా ఈ సరికొత్త మోడల్ రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

2025 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించిన టాటా అవిన్య ఈవీ..
2025 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించిన టాటా అవిన్య ఈవీ..

టాటా అవిన్య ఈవీ- జేఎల్ఆర్ టెక్నాలజీతో..

అవిన్య ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇది జగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్​ఆర్​)కు చెందిన 'ఎలక్ట్రిఫైడ్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఈఎంఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. దీని కోసం టాటా మోటార్స్, జేఎల్ఆర్‌కు రాయల్టీ కూడా చెల్లించనుంది. అయితే, ఈ టెక్నాలజీని పూర్తిగా లోకలైజేషన్​ చేయడం ద్వారా ధరను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం టాటా సుమారు రూ. 18,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది.

టాటా అవిన్య ఈవీ- వినూత్న డిజైన్.. ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు

టాటా అవిన్య ఈవీ చూడటానికి కూపే స్టైల్‌లో, స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలోని కొన్ని ముఖ్య ఫీచర్లు ఇవే:

నాలుగు తెరల డ్యాష్‌బోర్డ్: డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లతో పాటు కన్సోల్ వద్ద మరో పెద్ద స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.

అత్యాధునిక టెక్నాలజీ: లెవల్-2 అడాస్​, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్.

స్మార్ట్ ఫీచర్లు: కారు ద్వారా మరో కారుకు లేదా ఇతర వస్తువులకు పవర్ ఇచ్చే వీ2ఎల్​, వీ2వీ ఫంక్షనాలిటీలు.

డిజైన్ ఎలిమెంట్స్: పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్.

ఈ టాటా అవిన్య ఈవీ బ్యాటరీ, రేంజ్​ సహా ఇతర వివరాలపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది. లాంచ్​ టైమ్​ నాటికి ఈ వివరాలు అందుబాటులోకి వస్తాయి.

టాటా అవిన్య ఈవీ- ప్రత్యేక షోరూమ్‌లు..

అవిన్య బ్రాండ్ ఉత్పత్తుల కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా టైర్-1, టైర్-2 నగరాల్లో పెరుగుతున్న లగ్జరీ ఈవీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ షోరూమ్‌లను తీసుకురానున్నారు.

ప్రస్తుతం భారత్‌లోని ఈవీ మార్కెట్లో 43 శాతం వాటా కలిగిన టాటా, అవిన్య లాంచ్‌తో దీనిని 50 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీమియం ప్లాట్‌ఫామ్, ఆధునిక హంగులతో రానున్న అవిన్య, భారత లగ్జరీ కార్ల మార్కెట్​లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుందని ఆటోమొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టాటా మోటార్స్​కి ఇండియాలో టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్​ ఈవీ, టాటా పంచ్​ ఈవీ, టాటా నెక్సాన్​ ఈవీ, టాటా కర్వ్​ ఈవీ, టాటా హారియర్​ ఈవీ, టాటా సఫారీ ఈవీ వంటి మోడల్స్​ ఉన్నాయి.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- టాటా అవిన్య ఈవీ రేంజ్ ఎంత? దీనికి ఛార్జింగ్ ఎంత సమయం పడుతుంది?

సమాధానం- టాటా అవిన్య సింగిల్ ఛార్జ్‌పై కనీసం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. దీనివల్ల కేవలం 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 500 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

ప్రశ్న- అవిన్య ఈవీ ధర ఎంత ఉండవచ్చు? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది?

సమాధానం- అవిన్య అనేది టాటా నుంచి వస్తున్న అత్యంత లగ్జరీ ఈవీ బ్రాండ్. దీని ప్రారంభ ధర రూ. 30 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్ 2026 చివరి నాటికి భారత మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More