రేపే Tata Sierra ఎస్‌యూవీ లాంచ్- నెవర్ బిఫోర్ ఫీచర్స్ తీసుకొచ్చిన టాటా మోటార్స్!
2025 టాటా సియెర్రా ఎస్‌యూవీ మంగళవారం లాంచ్కానుంది. ఈ మోడల్లో టాటా మోటార్స్‌కి సంబంధించి కొన్ని నెవర్ బిఫోర్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2025 మచ్ అవైటెడ్ కార్స్లో టాటా సియెర్రా ఒకటి. ఈ ఎస్‌యూవీ రేపు, 25 నవంబర్ 2025న భారత దేశంలో లాంచ్కానుంది. 1991లో తొలిసారి భారత రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో భారతీయులను పలకరించనుంది. ప్రస్తుతం ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లాంచ్ అవుతుంది. తర్వాతి నెలల్లో ఈవీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, స్టైల్‌తో పాటు టెక్నాలజీ పరంగా కూడా టాటా సియెర్రా అదరగొట్టనుంది! ఈ ఎస్‌యూవీలో చాలా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని టాటా కార్లలో మొదటిసారిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ చరిత్రలోనే సియెర్రాలో తొలిసారిగా పరిచయం చేస్తున్న 5 కొత్త ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్‌యూవీ- 5 కొత్త ఫీచర్స్..
1. ట్రిపుల్-స్క్రీన్ సెటప్
25 నంవబర్ 2025న లాంచ్‌కానున్న టాటా సియెర్రాలో సరికొత్త మూడు స్క్రీన్ల డాష్‌బోర్డ్ లేఔట్ ఉంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ స్క్రీన్ ఉంటాయి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఇది మొదటిసారిగా కనిపిస్తున్న ఫీచర్! అలాగే టాటా మోటార్స్‌కు కూడా ఇది కొత్త. ఈ స్క్రీన్‌లు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు అంతర్నిర్మిత యాప్‌లతో వస్తాయని భావిస్తున్నారు.
అయితే ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ బేస్ వేరియంట్లలో రాకపోవచ్చు.
2. సౌండ్ బార్‌తో కూడిన జేబీఎల్ ఆడియో సిస్టమ్)
టాటా సియెర్రాలో డాల్బీ అట్మాస్‌తో కూడిన 12-స్పీకర్ల ప్రీమియం జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఈ సెటప్‌లో సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్ కూడా డాష్‌బోర్డ్‌పై, మిడిల్ ఏసీ వెంట్స్ కింద అమర్చారు. ఇది అద్భుతమైన ఆడియో అనుభవాన్ని ఇస్తుంది.
3. అడ్జెస్ట్ చేయగల అండర్-థై సపోర్ట్- ఎక్స్‌టెండబుల్ సన్ వైజర్‌లు
టాటా మోటార్స్ ఫ్రంట్ సీట్ల కోసం సర్దుబాటు చేయగల అండర్-థై సపోర్ట్‌ను ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తోంది. ఈ అడ్జెస్ట్మెంట్ మాన్యువల్‌గా ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎక్కువ ఎత్తు ఉన్న ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్.
అంతేకాకుండా సన్ వైజర్‌లను కూడా పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు. ముందు విండ్‌షీల్డ్‌కు కిందికి పొడిగింపు ఉపయోగపడుతుంది. అదేవిధంగా, దాని డిఫాల్ట్ స్థానం నుంచి వేరు చేసి, పక్కకు పొడిగించడం ద్వారా సైడ్ విండోలకు మెరుగైన కవరేజీ లభిస్తుంది.
4. సహాయక టెయిల్ ల్యాంప్‌లు
సియెర్రాలో ఆగ్జిలరీ టెయిల్ ల్యాంప్ సెటప్ ఉంది. ఇది బూట్ లిడ్ తెరిచినప్పుడు పనిచేస్తుంది. రాత్రి వేళల్లో అదనపు భద్రత, సౌకర్యాన్ని అందిస్తుంది. మాస్-మార్కెట్ విభాగంలో ఇది చాలా ప్రత్యేకమైన ఫీచర్. అంతేకాకుండా టాటా మోటార్స్‌లో ఇదే మొదటిసారి.
5. కొత్త 1.5-లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్
టాటా మోటార్స్ తమ హైపెరియన్ పవర్‌ట్రైన్ లైన్-అప్‌లో భాగమైన 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను సియెర్రాతో ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఇంజిన్ 168 బీహెచ్‌పీ పవర్‌ని, 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
టాటా సియెర్ర్ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలు రేపటి లాంచ్‌తో అందుబాటులోకి వస్తాయి.













