Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు- వాటి ఫీచర్లు..

ఇటీవలే లాంచ్​ అయిన టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ వెర్షన్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. 2026 టాటా పంచ్​ ఈవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 22, 2026, 05:51:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్​లో సంచలనం సృష్టిస్తూ టాటా మోటార్స్ తన ‘పంచ్ ఈవీ’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు​ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..
టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..

2026 టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు..

ఈ మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో ఫీచర్లకు అసలు కొదవే లేదు!

టాటా పంచ్ ఈవీ​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు- వాటి ఫీచర్లు​..

1. టాటా పంచ్ ఈవీ - స్మార్ట్

ఇది బేస్ వేరియంట్, ఇందులో 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. తక్కువ ధరలో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను ఇందులో అందించారు.

ముఖ్య ఫీచర్లు: హై బీమ్ అలర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హబ్ క్యాప్స్‌తో కూడిన 15- ఇంచ్​ స్టీల్ వీల్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ.

సౌకర్యం: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-లెవల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, స్టీరింగ్ వీల్‌పై వెలుగులీనే టాటా లోగో.

డ్రైవర్ కోసం: హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ పవర్ విండోస్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 4- ఇంచ్​ ఎంఐడీ స్క్రీన్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్, సిటీ, స్పోర్ట్ అనే రెండు డ్రైవ్ మోడ్స్.

భద్రత: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్​పీ), హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​).

2. టాటా పంచ్ ఈవీ - స్మార్ట్+

ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ​ వేరియంట్ 30 కేడబ్ల్యూహెచ్​, 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది.

అదనపు ఫీచర్లు: 8- ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్.

ఛార్జింగ్ అండ్​ కీ: 65డబ్ల్యూ యూఎస్బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, సెంట్రల్ లాకింగ్‌తో కూడిన రిమోట్ కీ.

ఇతరాలు: రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడల్ షిఫ్టర్లు, యాంటీ-గ్లేర్ ఐఆర్​ఎం, షార్క్-ఫిన్ యాంటెన్నా.

40 కేడబ్ల్యూహెచ్​ వెర్షన్‌లో మాత్రమే: రివర్స్ కెమెరా, హిల్-హోల్డ్ కంట్రోల్, ఎకో డ్రైవ్ మోడ్, 16- ఇంచ్​ స్టీల్ వీల్స్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ సెలెక్టర్ వద్ద నర్లెడ్ ఫినిషింగ్.

3. టాటా పంచ్ ఈవీ - అడ్వెంచర్

ఇది కేవలం 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో మాత్రమే వస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని సులభతరం చేసే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఫీచర్లు: పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-డిసెంట్ కంట్రోల్.

ఎక్స్‌టీరియర్: ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్​వీఎంలు (సైడ్ మిర్రర్స్), 16-ఇంచ్​ ఏరో-ఆప్టిమైజ్డ్ స్టీల్ వీల్స్.

4. టాటా పంచ్ ఈవీ - ఎంపవర్డ్

ఈ 2026 టాటా పంచ్​ ఈవీ వేరియంట్ అత్యాధునిక సాంకేతికతతో, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

టెక్నాలజీ: 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్​ యాపిల్ కార్ ప్లేతో కూడిన 10.25- ఇంచ్​ పెద్ద టచ్‌స్క్రీన్.

ఆడియో అండ్​ డిస్‌ప్లే: హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, ఇన్‌-బిల్ట్ యాప్ సపోర్ట్, నేవిగేషన్ వ్యూతో కూడిన 10.25- ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.

డిజైన్: 16- ఇంచ్​ ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్​వీఎంలు, వెనుక వైపు ఎల్ఈడీ లైట్ బార్.

సౌకర్యం: ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ 15డబ్ల్యూ యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్.

5. టాటా పంచ్ ఈవీ - ఎంపవర్డ్+

ఇది లైన్-అప్‌లోనే అత్యంత విలాసవంతమైన టాప్-ఎండ్ వేరియంట్.

లగ్జరీ ఫీచర్లు: వాయిస్ యాక్టివేటెడ్ సన్‌రూఫ్, లెదరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (వేసవిలో సీట్ల నుండి గాలి వచ్చే సదుపాయం).

అదనపు సౌకర్యాలు: వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆర్మ్‌రెస్ట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్.

సేఫ్టీ అండ్​ లుక్స్: అత్యవసర సమయాల్లో ఉపయోగపడే 'ఎస్​ఓఎస్​ కాలింగ్' ఫీచర్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ధరల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More