Tata Punch EV : రూ. 9.69 లక్షలకే టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- రేంజ్​ ఎంతంటే..

మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ శుక్రవారం లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రేంజ్​, ఫీచర్స్​, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 20, 2026, 13:00:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత నెలలో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని లాంచ్​ చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. శుక్రవారం మచ్​ అవైటెడ్​ 2026 టాటా పంచ్​ ఈవీని విడుదల చేసింది. ఈ మేరకు ముంబైలో ఒక గ్రాండ్​ ఈవెంట్​ని నిర్వహించి ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ రేంజ్​, ఫీచర్స్​ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..
టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- ఎక్స్​టీరియర్​..

2026 టాటా పంచ్​ ఈవీ కొత్త ఫ్రెంట్​ డిజైన్​తో కూడిన పాత సిల్హౌట్​ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది ఫ్రెంట్​ డిజైన్​ విషయంలో నెక్సాన్​ ఈవీ, హారియర్​ ఈవీ సరసన చేరింది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ ఇప్పుడు మరింత క్లీన్​గా కనిపిస్తోంది. పాత మోడల్​లో ఉన్న బ్లాక్​ స్ట్రిప్​ని తీసేసి, ముందువైపు క్లోజ్డ్​ గ్రిల్​ మాత్రమే ఉంచారు. ఇప్పుడు లుక్​ ఫ్రెష్​గా ఉంది. ఇందులో ఫుల్​ విడ్త్​ లైట్​ స్ట్రిప్​తో కూడిన డీఆర్​ఎల్స్​ ఉంటాయి. బంపర్​కి కూడా స్వల్పంగా మార్పులు చేశారు.

ఇక ఈ ఈవీ సైడ్​ ప్రొఫైల్​ పాత మోడల్​నే పోలి ఉంది. ఫ్రెంట్​లో పుల్​-స్టైల్​ డోర్​ హ్యాండిల్స్​ ఇచ్చారు. రేర్​లోని డోర్​ హ్యాండిల్స్​ సీ-పిల్లర్​కే ఉంటాయి.

ఇప్పుడు టాటా పంచ్​ ఈవీ బరువు 1360 కేజీలు. దీని గ్రౌండ్​ క్లియరెన్స్​ 195ఎంఎం. 450ఎంఎం లోతున్న నీటిలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కారు ప్రయాణించగలదు.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- ఇంటీరియర్​..

టాటా పంచ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇంటీరియర్​ ఇప్పుడు ఉదయ్​పూర్​ థీమ్​తో కూడిన లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ టోన్​ డ్యాష్​బోర్డు, లైట్​ కలర్స్​, టాగిల్​ స్విఛ్​లతో వస్తోంది.

ఇందులో నేవిగేషన్​, ఎనలిటిక్స్​, రిమోట్​ కమాండ్స్​తో పాటు మరిన్ని ఆపరేషన్స్​ చేగలగే కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ కూడా ఉంటుంది.

గతంలో ఉన్న 10.2 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ని 12.3 ఇంచ్​తో రిప్లేస్​ చేసింది టాటా మోటార్స్​. ఇక హయ్యర్​ వేరియంట్లలో ప్రీమియం ఆడియో సిస్టెమ్​ని కూడా అమర్చింది.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- సరికొత్త ఈటీఎక్స్​వీ సిస్టెమ్​..

2026 టాటా పంచ్​లో, సెగ్మెంట్​లోనే తొలి ఈటీఎక్స్​వీ సిస్టెమ్​ ఉందని సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థ క్యాబిన్​ని ఆప్టిమైజ్​ చేస్తుందని, బ్యాటరీని కూల్​ చేస్తుందని పేర్కొంది. దీని వల్ల ప్యాసింజర్​కి సౌకర్యం పెరగడంతో పాటు ఎఫీషియెన్సీ 1శాతం వృద్ధి చెందుతుందని స్పష్టం చేసింది.

ఈ పంచ్​ ఈవీలో ఐ-ఎఫ్​ఏటీసీ సెటప్​ కూడా ఉంది. ఇదొక ఇంటెలిజెంట్​, ఫుల్లీ ఆటోమేటిక్​ టెంపరేచర్​ కంట్రోల్​ వ్యవస్థ అని, దీని ద్వారా మొత్తం ఈవీ పర్ఫార్మెన్స్​ మెరుగుపడుతుందని సంస్థ పేర్కొంది.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- బ్యాటరీ, రేంజ్​..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో పెద్ద బ్యాటరీ ప్యాక్​ని సంస్థ ఇచ్చింది. ఈ 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 468 కి.మీ ఏఆర్​ఏఐ సర్టిఫైడ్​ రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. రియల్​- వరల్డ్​లో దీని రేంజ్​ 355 కి.మీ వరకు ఉంటుందని స్పష్టం చేసింది.

అంతేకాదు ఇందులో 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని కొనసాగించారు. దీని రియల్​ వరల్డ్​ రేంజ్​ 265 కి.మీ నుంచి 280 కి.మీ వరకు ఉంటుంది.

పాత 25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని సంస్థ డిస్కంటిన్యూ చేసింది.

ఈ కొత్త పంచ్​ ఈవీలో 95 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంది. ఈ మైక్రో ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. 0-100 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 9 సెకన్లలో అందుకుంటుందని టాటా మోటార్స్​ స్పష్టం చేసింది.

ఈ 2026 టాటా పంచ్​ని ఫాస్ట్​ ఛార్జర్​తో 20-80శాతం ఛార్జ్​ చేసేందుకు కేవలం 26 నిమిషాల సమయం పడుతుందని సంస్థ ప్రకటించింది. 15 నిమిషాల ఛార్జింగ్​తో 135 కి.మీ దూరం ప్రయాణించవచ్చని వివరించింది. అంతేకాదు మల్టిపుల్​ ఛార్జింగ్​ ఆప్షన్స్​ (డీసీ ఫాస్ట్​ ఛార్జర్​, వాల్​బాక్స్​ ఛార్జర్​, హోమ్​ ఛార్జర్​)ని సంస్థ ప్రవేశపెట్టింది.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- సేఫ్టీ ఫీచర్స్​..

భద్రతకు పెట్టింది పేరుగా గుర్తింపు ఉన్న టాటా మోటార్స్​.. ఈ పంచ్​ ఈవీలో కూడా అనేక సేఫ్టీ ఫీచర్స్​ని ఇచ్చింది. ప్రతి వేరియంట్​కి ఇప్పుడు 6 ఎయిర్​బ్యాగులు, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఐ-టీపీఎంఎస్​, ISOFIX మౌంట్స్​ స్టాండర్డ్​గా లభిస్తున్నాయి.

అంతేకాదు, కొత్త ఐ- హై బీమ్​ అసిస్ట్​ కూడా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఉంటుంది. ఇది హై బీమ్​ని డిటెక్ట్​ చేసి, డ్రైవర్​ని అలర్ట్​ చేస్తుంది. ఈ ఫీచర్​ 10కేఎంపీహెచ్​- 40కేఎంపీహెచ్​ స్పీడ్​లో పనిచేస్తుంది. ఇది అన్ని వేరియంట్లకు స్టాండర్డ్​గా లభిస్తుంది.

మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి 5 స్టార్​ సేఫ్టీ లభిస్తుందని టాటా మోటార్స్​ ప్రకటించింది.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, వాటి ధరలు..

టాటా పంచ్​ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి..

స్మార్ట్​- రూ. 9.69 లక్షలు

స్మార్ట్​+ - రూ. 10.29 లక్షలు

ఇక టాటా పంచ్​ ఈవీ 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ 4 వేరియంట్లలో లభిస్తోంది. అవి..

స్మార్ట్​+ - రూ. 10.89 లక్షలు

అడ్వెంచర్​- రూ. 11.59 లక్షలు

ఎంపవర్డ్​- రూ. 12.29 లక్షలు

ఎంపవర్డ్​+ ఎస్​- రూ. 12.59 లక్షలు

* ఇవి ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.

ఈ 2026 టాటా పంచ్​ ఈవీలో బీఏఏఎస్​ (బ్యాటరీ ఆస్​ ఏ సర్వీస్​) ప్రోగ్రామ్​ని కూడా సంస్థ ప్రారంభించింది. ఈ బీఏఏఎస్​ ప్రారంభ ధర రూ. 6.49లక్షలు + రూ. 2.6 / కి.మీ బ్యాటరీ ఈఎంఐగా సంస్థ నిర్ణయించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More