Tata Punch EV : సరికొత్తగా టాటా పంచ్ ఈవీ- ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ రేపే..
2026 మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అప్డేట్స్లో ఒకటైన టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి 20న లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ “పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్” వెర్షన్‌ను రేపు, ఫిబ్రవరి 20, 2026 అధికారికంగా లాంచ్ చేయనుంది. పెట్రోల్ వెర్షన్ పంచ్‌లో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుంటూ, మరిన్ని హై-టెక్ ఫీచర్లతో ఈ కొత్త ఈవీ రాబోతోంది.

ఈ కొత్త మోడల్‌లో ఆశించే ప్రధాన మార్పులు, విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- హైలైట్స్ ఇవి!
1. ఎక్స్టీరియర్ డిజైన్..
ముందు భాగం: 2026 టాటా పంచ్ ఈవీలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉంటుంది. పాత మోడల్‌లో ఉన్న బ్లాక్ స్ట్రిప్‌ను తొలగించి, క్లీన్ సీల్డ్-ఆఫ్ గ్రిల్‌ను అందించారు.
లైటింగ్: ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్ (డీఆర్ఎల్స్), సీక్వెన్షియల్ ఇండికేటర్లు కొనసాగుతాయి.
సైడ్ ప్రొఫైల్: కొత్త 16 ఇంచ్ ఏరో-డిజైన్ అల్లాయ్ వీల్స్ మినహా మిగిలిన రూపం పాత మోడల్ తరహాలోనే ఉంటుంది. డోర్లపై 'Tata.ev' బ్యాడ్జింగ్ కనిపిస్తుంది.
వెనుక భాగం: పెట్రోల్ పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాగే, దీనికి కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది.
2. ఇంటీరియర్ అండ్ ఫీచర్స్..
పెద్ద స్క్రీన్: ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ప్రస్తుతమున్న 10.25-ఇంచ్ స్క్రీన్ స్థానంలో, భారీ 12.3- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.
సేఫ్టీ (అడాస్): ఈ అప్‌డేట్‌లో అతిపెద్ద హైలైట్ లెవల్ 2 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్). దీని ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
ఇతర ఫీచర్లు: 10.25- ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, వాయిస్ అసిస్టెంట్ వంటివి ఉంటాయి.
3. బ్యాటరీ అండ్ రేంజ్..
మీడియం రేంజ్: 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ (సుమారు 315 కి.మీ రేంజ్).
లాంగ్ రేంజ్: 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ (సుమారు 421 కి.మీ రేంజ్).
అయితే టాటా మోటార్స్ ఇటీవలే ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో 2026 టాటా పంచ్ ఈవీ ఉంది. ఆ వీడియోలో టాటా పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌తో 590 కి.మీ కన్నా ఎక్కువ తిరిగినట్టు చెప్పారు. ఈ భారీ రేంజ్‌కి కారణాలను లాంచ్ టైమ్‌లో సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.
590 కి.మీ రేంజ్ టాటా పంచ్ ఈవీ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
పవర్: చిన్న బ్యాటరీ 80 హెచ్‌పీ పవర్‌ను, పెద్ద బ్యాటరీ 120 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- ధర (అంచనా)..
కొత్త ఫీచర్ల కారణంగా ఈ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రారంభ ధర: రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
టాప్ వేరియంట్: రూ. 15.49 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


