Hyundai verna facelift : కొత్త హంగులతో హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్ ఫోటోలు లీక్!
హ్యుందాయ్ వెర్నా అప్‌డేటెడ్ వెర్షన్ టెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. కొత్త స్టీరింగ్ వీల్, స్పోర్టీ ఇంటీరియర్, రీడిజైన్ చేసిన ఎక్స్‌టీరియర్ ఫీచర్లతో ఈ సెడాన్ మరింత ప్రీమియంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
హ్యుందాయ్ మోటార్స్ తన పాపులర్ సెడాన్ 'వెర్నా' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై వేగంగా పనిచేస్తోంది. కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే, ఈ కారు రోడ్డు మీద టెస్టింగ్ చేస్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. ముఖ్యంగా ఈ సెడాన్ ఇంటీరియర్స్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, పాత మోడల్ కంటే ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో స్పష్టత వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- సెడాన్ ఇంటీరియర్‌లో కీలక మార్పులు..
లీకైన ఫోటోల ప్రకారం, హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ లోపల సంస్థ గణనీయమైన మార్పులు చేసింది:
కొత్త స్టీరింగ్ వీల్: పాత స్టీరింగ్ స్థానంలో హ్యుందాయ్ కొత్త మోడల్స్ (అయానిక్ 5 వంటివి)లో కనిపించే స్టీరింగ్ వీల్‌ను ఇందులో అందించారు. దీని మధ్యలో హ్యుందాయ్ 'హెచ్' లోగోకు బదులుగా నాలుగు చుక్కలు ఉండటం విశేషం.
స్పోర్టీ లుక్: టెస్టింగ్ చేస్తున్న కారును గమనిస్తే, ఇది స్పోర్టీ వెర్షన్ అని తెలుస్తోంది. స్టీరింగ్ వీల్, సీట్ కవర్లపై ఎరుపు రంగు స్టిచింగ్‌తో కూడిన డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను ఇందులో చూడవచ్చు.
డిస్‌ప్లే: ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా రెండు 10.25-ఇంచ్ స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తాయి.
MG Majestor Vs Toyota Fortuner : ఈ రెండు బడా ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఎక్స్‌టీరియర్ డిజైన్..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బయటి భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు భాగంలో ఉండే హారిజాంటల్ ఎల్‌ఈడీ స్ట్రిప్ అలాగే కొనసాగుతాయి. అయితే కింద చెప్పిన వాటిల్లో మార్పులు కనిపిస్తాయి.
ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్: కారు ముందు వైపు ఉన్న గ్రిల్ డిజైన్‌లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. బంపర్ కింది భాగంలో, వెనుక బంపర్ వద్ద సిల్వర్ యాక్సెంట్స్ కనిపించే అవకాశం ఉంది.
అలాయ్ వీల్స్: కారుకు మరింత ఆధునిక రూపాన్ని ఇచ్చేందుకు అలాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేయనున్నారు.
ఎస్‌యూవీల వైపే మొగ్గు, పడిపోయిన చిన్న కార్ల విక్రయాలు: సియామ్ తాజా గణాంకాలు ఇవీ
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఇంజన్, పెర్ఫార్మెన్స్..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. గతంలో ఉన్న రెండు పెట్రోల్ ఆప్షన్లతోనే ఈ సెడాన్ లభించవచ్చు. అవి..
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: ఇది 115 హెచ్‌పీ పవర్‌ని, 143 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, ఐవీటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
1.5-లీటర్ టర్బో పెట్రోల్: ఇది 160 హెచ్‌పీ పవర్‌ని, 257 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది మాన్యువల్, డీసీటీ (డ్యూయల్ క్లచ్) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్‌పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాంచ్ నా టికి ఈ కొత్త వెర్నా సెడాన్‌కి సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు తెలుస్తాయి.
మరో వార్తలో ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన తన పోర్ట్‌ఫోలియోలోని పలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై హ్యుందాయ్ ఇండియా సంస్థ భారీ ఆఫర్లను ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 73వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఆఫర్లు ఈ ఫిబ్రవరి 28 వరకే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆఫర్ల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రశ్నలు- సమాధానాలు-
ప్రశ్న- కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
ప్రస్తుత సమాచారం ప్రకారం, 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మార్చి 2026 నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఇండియా ఇప్పటికే ఈ కారును రోడ్లపై టెస్టింగ్ చేస్తుండటంతో, ఇది మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని సూచిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


