Sign in

Hyundai discounts : ఈ ఫిబ్రవరిలో కొత్త వెహికిల్​ కొనాలా? హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు..

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరి నెలకు గానూ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెర్నా, ఐ20, ఎక్స్​టర్​, గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లపై గరిష్టంగా రూ. 73,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 6, 2026, 16:15:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్ ఇండియా తీపి కబురు అందించింది. ఈ ఫిబ్రవరి నెలలో.. పలు ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను, బెనిఫిట్స్​ని ప్రకటించింది. వెర్నా, i20, ఎక్స్​టర్​, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి కార్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. డీలర్లను బట్టి ఇవి మారుతుంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు..
హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు..

ఫిబ్రవరి 2026లో హ్యుందాయ్ కార్లపై లభించే ప్రయోజనాలు:

హ్యుందాయ్ వెర్నా: ఈ మిడ్‌సైజ్ సెడాన్‌పై ఫిబ్రవరిలో అత్యధికంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్​ని ఇస్తోంది హ్యుందాయ్ సంస్థ. సౌకర్యవంతమైన ప్రయాణం, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి వెర్నా ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

హ్యుందాయ్ ఐ20: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఐ20పై రూ. 48,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో పాటు, ఐ20లోని కొన్ని వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలను హ్యుందాయ్ సవరించింది.

ఎరా వేరియంట్: ఇప్పుడు రూ. 5.99 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. గత ధరతో పోల్చితే ఇదే రూ. 1లక్ష తక్కువ!

మాగ్నా ఎగ్జిక్యూటివ్: గతంలో రూ. 6,86,865 ఉండగా, ఇప్పుడు రూ. 6,73,900 కి తగ్గింది.

మాగ్నా వేరియంట్: రూ. 7,12,385 నుంచి రూ. 6,99,900 కి తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హ్యుందాయ్ ఎక్స్​టర్​: హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్​టర్'పై ఫిబ్రవరిలో రూ. 33,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో స్టైలిష్ ఎస్‌యూవీ లుక్ కోరుకునే వారిని ఈ కారు ఆకట్టుకుంటోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: ప్రాక్టికల్, ఈజీ-టు-డ్రైవ్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగాంచిన గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 48,000 వరకు తగ్గింపు లభిస్తోంది.

వాలెంటైన్స్ స్పెషల్ ఈవెంట్ - ‘ఆల్వేస్ అరౌండ్ క్యాంప్’..

సాధారణ డిస్కౌంట్లతో పాటు వాలెంటైన్స్ డే వీక్​ సందర్భంగా ఫిబ్రవరి 8న హ్యుందాయ్ 'ఆల్వేస్ అరౌండ్ క్యాంప్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఒక్క రోజు క్యాంపులో కారు అమ్మకాలు, సర్వీసింగ్, వెహికల్ ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

వినియోగదారులు తమకు సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించి, వేరియంట్ల వారీగా లభించే పూర్తి వివరాలను తెలుసుకోవాలని కంపెనీ సూచించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More