హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- కొత్త మోడల్‌లో భారీ మార్పులు, అప్‌డేట్స్ ఇవే!
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ మరోసారి దర్శనమిచ్చింది. కొరియా రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన వెర్నాను చూస్తే భారీ డిజైన్ మార్పులు ఖాయం అని అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
హ్యుందాయ్ వెర్నా తన ఆరవ తరం ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, భారతదేశంలో ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్‌బార్ డీఆర్ఎల్లు (డేటైమ్ రన్నింగ్ లైట్లు) ఉన్న మొదటి కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం, ఈ మిడ్-సైజ్ సెడాన్‌కు మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. దీని టెస్ట్ మ్యూల్ ఈసారి దక్షిణ కొరియా రోడ్లపై కనిపించింది. రాబోయే 2026 మోడల్ సంవత్సరానికి సంబంధించిన ఈ టెస్ట్ వెహికిల్, ముందు- వెనుక భాగాల్లో కప్పి ఉంచడం గమనించవచ్చు. దీనిని బట్టి, ఇందులో పెద్ద మార్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్..
కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన మార్పులు ప్రధానంగా సెడాన్ ముందు- వెనుక భాగంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ అప్‌డేట్స్‌లో భాగంగా, కొత్త ఫ్రంట్ గ్రిల్, మరింత స్లీక్ డిజైన్‌తో కూడిన బంపర్‌లు ఉండే అవకాశం ఉంది.
కారులో ఉన్న స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ డిజైన్, పూర్తి-వెడల్పు ఎల్ఈడీ డీఆర్ఎల్లు (లైట్‌బార్) అలాగే కొనసాగవచ్చు. అయితే, ఈ విభాగంలో కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి లైటింగ్ సిగ్నేచర్‌లో చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉంది.
టెస్ట్ మ్యూల్‌ను పరిశీలిస్తే, టెయిల్‌ల్యాంప్స్‌లో అప్‌డేట్‌లు, వెనుక బంపర్‌లో మార్పులు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొత్తంమీద వెర్నా ప్రస్తుత స్లీక్ సిల్హౌట్ అలాగే ఉంచి, కొత్త మోడల్ ఇయర్ కోసం సరికొత్త రూపాన్ని ఇవ్వడానికి ఈ మార్పులు దోహదపడతాయి. ఇది భారతదేశంలోని సెడాన్ కొనుగోలుదారులను ఆకర్షించడంలో ముఖ్యపాత్ర పోషించింది.
అవుట్‌గోయింగ్ మోడల్ నుంచి వేరుగా కనిపించడానికి, ఈ కారు కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌లపై కూడా వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్..
ఈ రోజుల్లో చాలా ఫేస్‌లిఫ్ట్‌లు కేవలం డిజైన్‌పై కాకుండా, ఫీచర్లు- ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లపై దృష్టి సారిస్తున్నాయి. వెర్నా ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ ట్రెండ్‌ను అనుసరించే అవకాశం ఉంది.
ఇందులో కొత్త అప్‌హోల్‌స్టరీ ఆప్షన్లు, మార్చిన ఇంటీరియర్ ట్రిమ్ ఉండొచ్చు. అలాగే, అప్‌డేట్ చేసిన క్రీచర్ కంఫర్ట్స్ (అదనపు సౌకర్యాల జాబితా) కూడా లభించవచ్చు. మొత్తం డాష్‌బోర్డ్ లేఅవుట్ అలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే, దీనిలోని డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లే మాత్రం అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్, గ్రాఫిక్‌లతో రావచ్చు.
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
ఈ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మెకానికల్ అప్‌డేట్‌లు తీసుకురావడానికి అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలే ఇందులో కూడా కొనసాగుతాయి.
వెర్నా ఫేస్‌లిఫ్ట్ యధావిధిగా 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ 113 బీహెచ్పీ పవర్, 143.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్పీ పవర్‌ని, 253 ఎన్ఎం పీక్ టార్క్‌ని అందిస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్, 7-స్పీడ్ డీసీటీ (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్)లు ఉంటాయి.
హ్యుందాయ్ వెర్నా- ధరలు, పోటీ..
ప్రస్తుతం హ్యుందాయ్ వెర్నా ధర భారతదేశంలో రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్ భారతదేశ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, దీని ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
ఇది మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టుస్ వంటి సెడాన్‌లతో మరింత బలంగా పోటీ పడుతుంది.














