Honda cars discount : డిసెంబర్ 31 వరకు ఈ హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఈ డిసెంబర్‌లో హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠంగా రూ. 1.36 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తోంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ 2025 డిసెంబర్ నెలాఖరు వరకు తమ అన్ని మోడళ్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను, బెనిఫిట్స్‌ని అందిస్తోంది హోండా కార్స్ ఇండియా. క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్టెండేడ్ వారంటీ ఆఫర్‌లు వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏ హోండా కారుపై ఎంత తగ్గింపు లభిస్తోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..
డిసెంబర్‌లో హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు..
1. హోండా ఎలివేట్-
టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్‌పై: మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్‌లు కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ. 1.36 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
క్యాష్ డిస్కౌంట్: రూ. 30,000 వరకు.
ఎక్స్ఛేంజ్ బోనస్: రూ. 45,000 వరకు.
అదనపు ప్రయోజనాలు: లాయల్టీ, కార్పొరేట్/స్వయం ఉపాధి ప్రయోజనాలు, కాంప్లిమెంటరీ ఎల్ఈడీ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, 7-సంవత్సరాల ఎక్స్టెండేడ్ వారంటీపై రూ. 19,000 తగ్గింపు.
ఎంట్రీ-లెవల్ ఎస్వీ ట్రిమ్‌పై: మొత్తం రూ. 38,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
స్క్రాపేజ్ ప్రయోజనాలు అదనం. వీటి విలువ కనీసం రూ. 20,000 (లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ. 5,000, వీటిలో ఏది ఎక్కువైతే అది).
తగ్గింపునకు ముందు ధర: హోండా ఎలివేట్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 11 లక్షల నుంచి రూ. 16.46 లక్షల మధ్య ఉన్నాయి.
2. హోండా సిటీ-
హోండా సిటీ సెడాన్ ఎస్వీ, వీ, వీఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్లపై: గరిష్టంగా రూ. 1.22 లక్షల విలువైన ప్రయోజనాలు అందిస్తున్నారు.
నగదు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు: కలిపి రూ. 80,000 వరకు.
లాయల్టీ బోనస్: రూ. 4,000.
కార్పొరేట్ బెనిఫిట్స్: రూ. 10,000 వరకు.
ఎక్స్టెండెడ్ వారంటీ: 7-సంవత్సరాల వారంటీపై రూ. 28,700 తగ్గింపు.
సిటీ హైబ్రిడ్‌పై: రాయితీపై 7-సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్‌పై రూ. 17,000 తగ్గింపు లభిస్తుంది.
తగ్గింపునకు ముందు ధర: హోండా సిటీ లైనప్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 11.95 లక్షల నుంచి రూ. 19.48 లక్షల మధ్య ఉన్నాయి.
3. హోండా అమేజ్-
థర్డ్ జనరేషన్ అమేజ్-
హోండా అమేజ్ జెడ్ఎక్స్ ఎంటీ వేరియంట్‌పై: మొత్తం రూ. 81,000 వరకు తగ్గింపులను పొందవచ్చు.
ఇందులో క్యాష్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఒక్కొక్కటి రూ. 30,000 చొప్పున ఉన్నాయి.
వీ ఎంటీ/సీవీటీ, జెడ్ఎక్స్ సీవీటీ వంటి ఇతర వేరియంట్లపై: రూ. 28,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
అన్ని వేరియంట్లపై కనీసం రూ. 20,000 విలువైన స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తున్నారు.
తగ్గింపునకు ముందు ధర: థర్డ్ జనరేషన్ అమేజ్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 7.40 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉన్నాయి.
సెకెండ్ జనరేషన్ అమేజ్-
ఎస్ ట్రిమ్ (మాన్యువల్, ఆటోమేటిక్) పై: గరిష్టంగా రూ. 89,000 వరకు ప్రయోజనాలు ఇస్తున్నారు.
క్యాష్ డిస్కౌంట్: రూ. 25,000.
ఎక్స్ఛేంజ్ బోనస్: రూ. 35,000.
లాయల్టీ రివార్డు: రూ. 4,000.
కార్పొరేట్ ప్రయోజనాలు: రూ. 10,000 వరకు.
ఎక్స్టెండెడ్ వారంటీ: 7-సంవత్సరాల వారంటీపై రూ. 15,000 తగ్గింపు.
తగ్గింపునకు ముందు ధర: ఈ కారు ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 6.97 లక్షల నుంచి రూ. 7.8 లక్షల మధ్య ఉన్నాయి.
గమనిక: ఇవి డీలర్-స్థాయి ఆఫర్లు. నగరం, లభ్యత, డీలర్‌షిప్‌ను బట్టి ఈ ప్రయోజనాలు మారవచ్చు! కొనుగోలు చేసే ముందు మీ సమీప హోండా డీలర్‌ను సంప్రదించి వివరాలు ధృవీకరించుకోవడం ఉత్తమం.

E-Paper












