MG Majestor Vs Toyota Fortuner : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'ఎంజీ మెజస్టర్'ను ఆవిష్కరించింది. ప్రీమియం డీ+ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్ విసురుతోంది ఈ ఎస్​యూవీ. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? అనేది ఇక్కడ తెలుసుకుందాము..

Published on: Feb 13, 2026 11:22 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా తన ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంజీ మెజెస్టర్​ని ఆవిష్కరించింది. ప్రీమియం డీ+ సెగ్మెంట్‌లో అడుగుపెడుతున్న ఈ బ్రాండ్‌కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు. ఎంజీ గ్లోస్టర్ సక్సెసర్​గా వస్తున్న ఈ మెజెస్టర్‌ను తొలిసారిగా 'ఆటో ఎక్స్‌పో 2025'లో ప్రదర్శించారు. ఇక తాజా అధికారిక లాంచ్‌తో దీని భారీ రూపం, అత్యాధునిక స్టైలింగ్‌పై పూర్తి స్పష్టత వచ్చింది.

ఎంజీ మెజెస్టర్​ వర్సెస్​ టయోటా ఫార్చ్యునర్​..
ఎంజీ మెజెస్టర్​ వర్సెస్​ టయోటా ఫార్చ్యునర్​..

కంపెనీ ప్రస్తుతానికి ఈ భారీ ఎస్​యూవీ ధరల వివరాలను వెల్లడించలేదు. ఏప్రిల్ 2026లో ధరలను ప్రకటించి, మే 2026 నుంచి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభించాలని లక్ష్యంగా సంస్థ పెట్టుకుంది.

అయితే, భారత మార్కెట్​లో విపరీతమైన క్రేజ్ ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌కు ఈ ఎంజీ మెజెస్టర్ గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంజీ మెజెస్టర్​ వర్సెస్​ టయోటా ఫార్చ్యునర్​ స్పెసిఫికేషన్స్​, ఇంజిన్​ ఆప్షన్స్​ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఎంజీ మెజెస్టర్ వర్సెస్​ టయోటా ఫార్చ్యూనర్- ఫీచర్లు..

మెజస్టర్ ఎస్​యూవీ క్యాబిన్ లోపల అడుగుపెడితే.. కంఫర్ట్, టెక్నాలజీకి పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. ఇందులో వివిధ రకాల మసాజ్ మోడ్స్ కలిగిన వెంటిలేటెడ్ సీట్లు, 12-స్పీకర్ల జేబీఎల్​ ఆడియో సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆకర్షణీయమైన పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. డ్రైవర్ సీటును 12 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 12.3-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో సపోర్ట్‌తో), పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.

ఎంజీ మెజెస్టర్​ ఎక్స్​టీరియర్​లో 'డ్రాగన్ ఐ' ఉన్న ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, నిలువుగా ఉండే ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఈ ఎస్​యూవీకి కొత్త లుక్ ఇచ్చాయి. ఇందులోని 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపు కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ వెహికిల్​కి అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్‌ని ఇస్తాయి.

భద్రత విషయంలో రాజీ లేకుండా, అడాస్​ లెవల్ 2, లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్-డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ హెచ్​డీ కెమెరాను అందించారు. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం మూడు డిఫరెన్షియల్ లాక్స్, ఎంపిక చేసుకోదగ్గ డ్రైవ్ మోడ్స్ (2హెచ్​, 4హెచ్​, 4ఎల్​) ఇందులో ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే.. ఇది కూడా విస్తృతమైన కన్వీనియన్స్, సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. పవర్-అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రీక్లైనింగ్ సదుపాయం ఉన్న రెండు- మూడో వరుస సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా 8-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 11-స్పీకర్ల జేబీఎల్​ ఆడియో సెటప్ ఉన్నాయి. భద్రత కోసం 7 ఎయిర్ బ్యాగులు, ఈఎస్​సీ, ట్రాక్షన్ కంట్రోల్, ISOFIX మౌంట్స్, హిల్ అసిస్ట్, డిఫరెన్షియల్ లాక్, డౌన్‌హిల్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.

ఎంజీ మెజెస్టర్ వర్సెస్​ టయోటా ఫార్చ్యూనర్- ఇంజిన్ సామర్థ్యం..

ఇంజిన్ పనితీరును గమనిస్తే, మెజెస్టర్‌లో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 216 హెచ్​పీ పవర్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్లోస్టర్ పవర్‌ట్రెయిన్ లాగే 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది.

మరోవైపు, టయోటా ఫార్చ్యూనర్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అందులో ఒకటి 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండోది 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ సిస్టమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 201 హెచ్​పీ పవర్, 500 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. అదనంగా, ఫార్చ్యూనర్ తన 2.8-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ను ఇప్పుడు 48-వోల్ట్ సిస్టమ్‌తో అనుసంధానించింది.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- ఎంజీ మెజెస్టర్​ ఎప్పుడు లాంచ్​ అయ్యింది?

సమాధానం- ఫిబ్రవరి 12.

ప్రశ్న- ఎంజీ మెజెస్టర్​ బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయా?

సమాధానం- ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. రూ. 41వేల టోకెన్​ అమౌంట్​తో కారును బుక్​ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ స్థానిక డీలర్​షిప్​షోరూమ్​ని సందర్శించాల్సి ఉంటుంది.