Tata Punch EV : టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ నుంచి బిగ్ అప్డేట్! ఏకంగా 593 కి.మీ రేంజ్..
టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ ‘పంచ్ ఈవీ’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20, 2026న భారత్‌లో విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ కారు రేంజ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియోను టాటా విడుదల చేసింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 593.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, తన సరికొత్త 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్' విడుదలకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 20న మార్కెట్లోకి రానున్న ఈ మోడల్, ఇప్పటికే రహదారులపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే తాజాగా టాటా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్‌కి సంబంధించినది.

2026 టాటా పంచ్ ఈవీ- రియల్ టైమ్ రేంజ్ టెస్ట్..
టాటా విడుదల చేసిన వీడియోలో ఒక ఆటోమొబైల్ జర్నలిస్ట్ ఈ ఎలక్ట్రిక్ కారును జైపూర్ నుంచి ఉదయపూర్ వరకు డ్రైవ్ చేశారు.
ప్రయాణం: జైపూర్‌లో 100% ఛార్జింగ్‌తో మొదలైన ప్రయాణం 200 కిలోమీటర్లు సాగిన తర్వాత (బిజైన్‌నగర్ వద్ద), కారులో ఇంకా 67% బ్యాటరీ మిగిలి ఉంది.
మైలురాయి: 400 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయపూర్ చేరుకున్నాక కూడా బ్యాటరీ 34% ఉంది.
ఫైనల్ రిజల్ట్: టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయే వరకు ప్రయాణాన్ని కొనసాగించగా, గుజరాత్‌లోని హిమత్‌నగర్ వద్ద కారు ఆగింది. అప్పటికి ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 593.6 కిలోమీటర్ల రేంజ్‌ని ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఇది అత్యుత్తమ రేంజ్ అని చెప్పవచ్చు. అయితే, టాటా ఇంకా కొత్త బ్యాటరీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
2026 టాటా పంచ్ ఈవీ- బ్యాటరీ, పవర్..
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త పంచ్ ఈవీలో పాత బ్యాటరీ ప్యాక్‌లనే కొనసాగించే అవకాశం ఉంది:
25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 82 హెచ్‌పీ పవర్, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ప్రస్తుత ఏఆర్ఏఐ రేంజ్: 265 కిమీ)
35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 122 హెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. (ప్రస్తుత ఏఆర్ఏఐ రేంజ్: 365 కిమీ)
లేటెస్ట్ రేంజ్ టెస్ట్ ఫలితాలను బట్టి చూస్తుంటే, టాటా తన నెక్సాన్ ఈవీలో వాడే 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే, దీని రేంజ్ అధికారికంగా మరింత పెరిగే అవకాశం ఉంది.
2026 టాటా పంచ్ ఈవీ- కొత్త డిజైన్, రంగులు..
బయట కనిపించిన చిత్రాల ప్రకారం, టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని కీలక మార్పులు జరిగాయి:
ముందు భాగం: బంపర్ డిజైన్‌ను మార్చారు. పాత మోడల్‌లో ఉన్న బ్లాక్ ట్రిమ్‌ను తొలగించి, క్లీన్ లుక్ ఇచ్చారు. వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అలాగే ఉన్నాయి.
వెనుక భాగం: పెట్రోల్ వెర్షన్ పంచ్‌లాగే, దీనికి కూడా ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ మరియు కొత్త బంపర్‌ను అమర్చారు.
రంగులు: ఇప్పటికే ఉన్న రెడ్ డ్యూయల్-టోన్ రంగుతో పాటు కొత్తగా బ్రౌన్, బ్రైట్ యెల్లో రంగుల్లో కూడా ఈ కారు లభించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


