త్వరలోనే టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్- ఈ ఫీచర్స్ ఉంటే కొనాల్సిందే!
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి 20న లాంచ్ కానుంది. పెద్ద స్క్రీన్, లెవల్-2 అడాస్, అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘టాటా పంచ్ ఈవీ’ని సరికొత్త హంగులతో సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. టాటా పంచ్ పెట్రోల్ వెర్షన్ తరహాలోనే, ఈ ఈవీ కూడా మరింత షార్ప్ లుక్, అగ్రెసివ్ డిజైన్‌తో రాబోతోంది. సబ్-4 మీటర్ల ఈవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు టాటా ఈ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. కేవలం బయటి రూపమే కాకుండా, లోపల ఫీచర్ల పరంగా కూడా భారీ మార్పులే ఉండబోతున్నాయి.

వచ్చే వారం లాంచ్ కానున్న ఈ కొత్త 2026 టాటా పంచ్ ఈవీలో మనం ఆశించదగిన టాప్ 5 ప్రధాన ఫీచర్లను ఇక్కడ చూసేయండి..
1. భారీ ఇన్‌ఫోటైన్‌మెంట్ అండ్ ప్రీమియం ఆడియో
కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుత మోడల్‌లోని 10.24-ఇంచ్ స్క్రీన్ స్థానంలో, నెక్సాన్ ఈవీలో ఉండే 12.3-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ రాబోతోంది. ఇది సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్తో పాటు వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, టాప్-ఎండ్ వేరియంట్లలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను కూడా టాటా అందించే అవకాశం ఉంది.
2. పవర్డ్ డ్రైవర్ సీట్ అండ్ రిఫ్రెష్డ్ ఇంటీరియర్
ప్రస్తుత టాటా పంచ్ ఈవీలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నప్పటికీ, డ్రైవర్ సీటును అడ్జస్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఆప్షన్ లేదు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 'పవర్డ్ డ్రైవర్ సీట్' ఫీచర్‌ను జోడించనున్నారు. లోపల క్యాబిన్ లేఅవుట్‌లో స్వల్ప మార్పులు చేస్తూ, కొత్త మెటీరియల్స్- డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో దీనికి ప్రీమియం లుక్ ఇవ్వనున్నారు. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో యథావిధిగా కొనసాగుతాయి.
3. లెవల్-2 అడాస్ భద్రత
భద్రత విషయంలో ఇప్పటికే 5-స్టార్ రేటింగ్ పొందిన పంచ్ ఈవీ, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి లెవల్-2 అడాస్ సాంకేతికతతో రాబోతోంది. ఇందులో లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఫ్రంట్ కొలీజన్ వార్నింగ్ వంటి అధునాతన సెఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఇది డ్రైవర్‌కు మరింత రక్షణ కల్పిస్తుంది.
4. సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచర్లు
వచ్చే మోడల్‌లో సాఫ్ట్‌వేర్ పరంగా విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి. ఇందులో మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డిజిటల్ కీ సపోర్ట్ (ఫోన్ ద్వారా కారును అన్‌లాక్ చేయడం), మరిన్ని యాప్ ఆధారిత నియంత్రణలను టాటా ప్రవేశపెట్టనుంది. దీనివల్ల కారు వినియోగం మరింత స్మార్ట్‌గా మారుతుంది.
5. షార్పర్ ఎక్స్‌టీరియర్ డిజైన్
డిజైన్ పరంగా కొత్త పంచ్ ఈవీ తన ఐసీఈ (పెట్రోల్) వెర్షన్ తరహాలోనే మరింత అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో ఇది రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించనుంది.
లాంచ్ నాటికి 2026 టాటా పంచ్ ఈవీ ఫీచర్లపై మరింత క్లారిటీ రానుంది.

E-Paper












