Best Dashcam : కారు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి! బోట్ కొత్త డాష్‌క్యామ్.. ధర రూ. 2499 నుంచే
బోట్ సంస్థ నుంచి కొత్త ప్రాడక్ట్ లాంచ్ అయ్యింది. అదే ‘డ్యాష్‌క్యామ్’. కారు భద్రతను పెంచే విధంగా రూపొందించిన ఈ హైవ్ డ్యాష్‌క్యామ్ మోడల్స్, ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఆడియో, వేరబుల్స్ విభాగం నుంచి విస్తరిస్తూ, బోట్ సంస్థ ఇప్పుడు ఇన్-కార్ సేఫ్టీ (కార్ రక్షణ) పరికరాల రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన 'హైవ్ డ్యాష్‌క్యామ్' సిరీస్‌ను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 2,499 నుంచి ప్రారంభమవుతున్నాయి.

బోట్ హైవ్ డ్యాష్‌క్యామ్- ధరలు, మోడల్స్:
ఈ బోట్ హైవ్ డ్యాష్‌క్యామ్ రేంజ్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి:
ఎఫ్1 మోడల్: దీని ధర రూ. 9,990.
ఎం1 మోడల్: దీని ధర రూ. 4,499.
ఈ1 మోడల్ (ఎంట్రీ లెవల్): దీని ధర రూ. 2,499.
ఈ డ్యాష్‌క్యామ్‌లు ప్రైవేట్ కార్ల యజమానులు, ప్రతిరోజూ ప్రయాణించే వారు, కమర్షియల్ వాహన నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని తయారయ్యాయి.
బోట్ హైవ్ డ్యాష్‌క్యామ్- కీలక ఫీచర్లు..
సెన్సార్లు: ఈ మూడు డ్యాష్‌క్యామ్‌లు సోనీ స్టార్విస్ సెన్సార్లతో వస్తున్నాయి. ఇవి తక్కువ వెలుతురులో, హై-గ్లేర్ (ఎక్కువ వెలుతురు) ఉన్న సమయంలో రికార్డింగ్ స్పష్టతను పెంచుతాయి.
బోట్ హైవ్ డ్యాష్‌క్యామ్ ఎఫ్1 (ఫ్లాగ్‌షిప్): ఇందులో డ్యూయల్ ఛానల్ రికార్డింగ్ సౌకర్యం ఉంది (4కే ఫ్రంట్ కెమెరా, 1080పీ రియర్ కెమెరా). దీనిలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టెమ్ (అడాస్) కూడా ఉంది. అంటే ఇది లేన్ మారినప్పుడు, ముందు వాహనాన్ని ఢీకొనే ప్రమాదం ఉన్నప్పుడు వాయిస్ అలర్ట్స్ ఇస్తుంది! అలాగే దీనిలో జీపీఎస్, వాయిస్ కంట్రోల్, వై-ఫై యాప్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.
బోట్ హైవ్ డ్యాష్క్యమ్ ఎం1: ఇది 140-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా 2కే క్యూహెచ్డీ రికార్డింగ్‌ను అందిస్తుంది. జీపీఎస్ ఆధారిత రూట్, స్పీడ్ ట్రాకింగ్, కొలిజన్ (ఢీకొన్నప్పుడు) గుర్తించే జీ-సెన్సార్, 512జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ దీని ప్రత్యేకత.
హైవ్ డ్యాష్‌క్యామ్ ఈ1 (ఎంట్రీ లెవల్): ఇది 1296పీ నాణ్యతతో రికార్డ్ చేస్తుంది. చిన్న సైజులో ఉండి, లూప్ రికార్డింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ రికార్డింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
డ్యాష్‌క్యామ్ అసలు ఎందుకు అవసరం?
వాస్తవానికి డ్యాష్‌క్యామ్ అనేది ఒకప్పుడు కారులో పెద్దగా అవసరం లేని లేదా అదనపు యాక్ససరీగా భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. రోడ్ల మీద, మరీ ముఖ్యంగా హైవేలపై నిర్మాణుష్య ప్రదేశాల్లో కొందరు వ్యక్తులు వాహనాలను ఆపేసి బెదిరించడం లేదా హఠాత్తుగా కారు కింద పడిపోయి, మన వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, డబ్బులు వసూలు చేస్తుండటం వంటివి ఇటీవలి కాలంలో వార్తల్లో కనిపిస్తూనే ఉంటున్నాయి. డ్యాష్‌క్యామ్ లేని వారు ఆ ఉచ్చులో చిక్కుకుపోయినట్టే! కానీ డ్యాష్‌క్యామ్ ఉంటే మాత్రం మనల్ని మనం డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, దురదృష్టవశాత్తు కారుకు ఏదైనా ప్రమాదం జరిగినా, డ్యాష్‌క్యామ్ అనేది ఎవిడెన్స్లా కూడా పనికొస్తుంది.
బోట్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రాడక్ట్..
ఈ లాంచ్ గురించి బోట్ సీఈఓ గౌరవ్ నయ్యర్ మాట్లాడుతూ.. "మేము బోట్ పోర్ట్‌ఫోలియోను ఆడియో, వేరబుల్స్ దాటి విస్తరిస్తున్న క్రమంలో, డ్యాష్‌క్యామ్‌ల విభాగంలోకి ప్రవేశించడం అనేది నేటి వినియోగదారుల కోసం స్మార్ట్, అర్థవంతమైన టెక్నాలజీని రూపొందించాలనే మా దార్శనికతలో ఒక భాగం. భారతీయ రోడ్లు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతున్నాయి. అందుకే డ్యాష్‌క్యామ్‌లు ఇప్పుడు విలాసం కాదు, ఒక అవసరం! బోట్ వద్ద మా లక్ష్యం.. నమ్మకమైన, చక్కగా ఇంజనీరింగ్ చేసిన, అత్యాధునిక డిజైన్ కలిగిన పరిష్కారాలను తీసుకురావడం, తద్వారా రోజువారీ ప్రయాణాలు సురక్షితంగా, మరింత నమ్మకంగా సాగుతాయి."
ఈ బోట్ హైవ్ డ్యాష్‌క్యామ్ ఎఫ్1, ఎం1, ఈ1 మోడల్స్ సంస్థ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


