Electric scooter : సిటీ డ్రైవ్​ కోసం కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- 110 కి.మీ రేంజ్​, ధర కూడా తక్కువే!

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్​ఎం), వ్యక్తిగత మొబిలిటీ విభాగంలోకి అడుగుపెడుతూ 'ఓఎస్ఎం వెక్స్​ట్రా'ను విడుదల చేసింది. రూ. 99,900 ధరకు లభించే ఈ హై-స్పీడ్ స్కూటర్, సింగిల్ ఛార్జ్‌పై 110 కి.మీ రేంజ్ అందిస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 6, 2026, 06:37:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్​ఎం), ఇప్పుడు సామాన్యుల ప్రయాణ అవసరాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ కంపెనీ, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ‘ఓఎస్ఎం వెక్స్​ట్రా’ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 99,900గా నిర్ణయించింది.

సిటీ డ్రైవ్​ కోసం కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..
సిటీ డ్రైవ్​ కోసం కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఓఎస్​ఎం వెక్స్​ట్రా ఎలక్ట్రిక్​ స్కూటర్​- సిటీ రైడింగ్‌ కోసం..

పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఓఎస్​ఎం వెక్స్​ట్రాని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇంట్లోనే వాడుకునే ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. పూర్తి ఛార్జింగ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.

ఓఎస్​ఎం వెక్స్​ట్రా ఎలక్ట్రిక్​ స్కూటర్​- ఆధునిక ఫీచర్లు.. స్మార్ట్ డ్రైవింగ్

ఓఎస్​ఎం వెక్స్​ట్రా ఎలక్ట్రిక్​ స్కూటర్‌లో రైడర్ల సౌకర్యం కోసం అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించారు:

డిస్‌ప్లే: బ్యాటరీ ఛార్జ్, స్పీడ్, ప్రయాణించాల్సిన దూరాన్ని సూచించే 3.5 ఇంచ్​ కలర్ ఎల్‌సీడీ స్క్రీన్.

రైడింగ్ మోడ్స్: అవసరాన్ని బట్టి ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు మోడ్లలో డ్రైవ్ చేయవచ్చు.

అదనపు సదుపాయాలు: ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ సులభతరం చేసే రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. అవసరమైతే జీఎస్ఎం కనెక్టివిటీని కూడా పొందే వీలుంది.

సామర్థ్యం: ఈ వాహనం 12 డిగ్రీల వరకు వాలు ఉన్న రోడ్లను కూడా సునాయాసంగా ఎక్కగలదు.

దేశవ్యాప్తంగా లభ్యత భారతదేశంలోని టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో ఉన్న 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌ల ద్వారా ఓఎస్​ఎం వెక్స్​ట్రాని విక్రయించాలని ఓమెగా సైకి లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం భారత్‌లోనే కాకుండా, ఆఫ్రికా దేశాలకు కూడా ఈ వాహనాన్ని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ప్లాంట్‌లో ఏడాదికి 25,000 ఓఎస్​ఎం వెక్స్​ట్రా ఎలక్ట్రిక్​ స్కూటర్​ యూనిట్లను తయారు చేసే సామర్థ్యం తమకు ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్ల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓమెగా సెైకి మొబిలిటీ స్పష్టం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More