Yamaha EC 06 వర్సెస్ River Indie- ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఎక్కువ? ధర తక్కువ?
ఇండియలో యమహా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ.. ఈ రెండు ఈ-స్కూటర్లలో దేని ధర తక్కువ? దేని రేంజ్ ఎక్కువ? వ్యత్యాసాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ప్రముఖ టూ-వీలర్ దిగ్గజం యమహా ఇండియా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈసీ-06ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ ఈ- స్కూటర్, ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు అనువుగా తయారైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్కూటర్‌ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘రివర్’ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఇది చూడటానికి రివర్ ఇండీ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, యమహా తన మార్కు స్టైల్‌ను జోడించింది. ఈ నేపథ్యంలో యమహా ఈసీ-06, రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి, వీటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాము..

యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- ధరల మధ్య వ్యత్యాసం..
ధర విషయంలో యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే రివర్ ఇండీ కొంత తక్కువగా ఉంది.
| యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- ధరలు | ||
|---|---|---|
| యమహ ఈసీ-06 | రివర్ ఇండీ | |
| ఎక్స్‌షోరూం ధర | రూ. 167,600 | రూ. 145,999 |
యమహా ఈసీ-06: రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్)
రివర్ ఇండీ: రూ. 1,45,999 (ఎక్స్-షోరూమ్)
యమహా బ్రాండ్ వాల్యూ, సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా ఈ స్కూటర్ రివర్ ఇండీ కంటే రూ. 21,601 అదనపు ప్రీమియం ధరను కలిగి ఉంది.
యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- పర్ఫార్మెన్స్..
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ ఒకే రకమైన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. కానీ రేంజ్, టాప్ స్పీడ్ విషయంలో చిన్నపాటి మార్పులు ఉన్నాయి:
| యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ - పర్ఫార్మెన్స్ | ||
|---|---|---|
| యమహా ఈసీ-06 | రివర్ ఇండీ | |
| బ్యాటరీ | 4 కేడబ్ల్యూ | 4 కేడబ్ల్యూ |
| రేంజ్ | 169 కి.మీ | 163 కి.మీ |
| పవర్ | 8.98 బీహెచ్పీ | 8.98 బీహెచ్పీ |
| టార్క్ | 26 ఎన్ఎం | 26 ఎన్ఎం |
| టాప్ స్పీడ్ | 79 కేఎంపీహెచ్ | 90 కేఎంపీహెచ్ |
యమహా ఈసీ-06లో 4 కేడబ్ల్యూ బ్యాటరీని ఇచ్చింది సంస్థ. దీని టాప్ స్పీడ్ 79 కేఎంపీహెచ్. రేంజ్ 169 కి.మీ. టార్క్ 26 ఎన్ఎం. ఇక రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా 4 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కానీ ఇది 163 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


